Life Insurance: రూ.3220 చెల్లిస్తే రూ.25,00,000 ఇన్స్యూరెన్స్

Flipkart Aegon Life Insurance | ఆదాయపు పన్ను శాఖ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద మినహాయింపు పొందొచ్చు. పాలసీ కొన్న తర్వాత ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్ మెయిల్ ద్వారా వస్తుంది.

news18-telugu
Updated: March 17, 2020, 7:06 PM IST
Life Insurance: రూ.3220 చెల్లిస్తే రూ.25,00,000 ఇన్స్యూరెన్స్
Life Insurance: రూ.3220 చెల్లిస్తే రూ.25,00,000 ఇన్స్యూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మేందుకు ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఏగాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 18 నుంచి 65 ఏళ్లలోపు కస్టమర్లు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఒక ఏడాది కాలానికి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ రూపొందించింది. ఈ పాలసీ తీసుకున్నవారు మరణిస్తే వారి నామినీకి ఇన్స్యూరెన్స్ డబ్బులు చెల్లిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్టరై వన్ టైమ్ ప్రీమియం పాలసీ తీసుకోవచ్చు. ఎలాంటి మెడికల్ టెస్టులు, పేపర్ వర్క్ లేకుండా ఈ పాలసీలు తీసుకోవచ్చు. అయితే పాలసీ తీసుకునే ముందు నియమనిబంధనలు సరిగ్గా చదవాలి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, వ్యాధులను వివరించాల్సి ఉంటుంది.

రూ.40,00,000 వరకు ఇన్‌స్టంట్ డిజిటల్ పాలసీ తీసుకోవచ్చు. రూ.1,00,000 టర్మ్ పాలసీ తీసుకోవడానికి రూ.129 చెల్లిస్తే చాలు. రూ.5,00,000 పాలసీకి రూ.644 చెల్లించాలి. రూ.10,00,000 పాలసీ తీసుకోవాలంటే రూ.1288 చెల్లించాలి. రూ.25,00,000 పాలసీ తీసుకోవాలంటే రూ.3220 చెల్లించాలి. రూ.40,00,000 పాలసీకి రూ.5152 ప్రీమియం చెల్లించాలి. ఆదాయపు పన్ను శాఖ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద మినహాయింపు పొందొచ్చు. పాలసీ కొన్న తర్వాత ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్ మెయిల్ ద్వారా వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: 6 రోజుల్లో రూ.5,000 తగ్గిన గోల్డ్ రేట్... ఇవాళ్టి ధరలివే

Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రీఫండ్... ఈ యాప్‌లో సాధ్యం

PAN Aadhaar Link: మార్చి 31 డెడ్‌లైన్... మీ పాన్-ఆధార్ లింక్ చేయండిలా
First published: March 17, 2020, 7:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading