విమానాలు ఎగిరే టైమ్ వచ్చింది... ఎయిర్ లైన్స్‌, ఎయిర్ పోర్టులకు ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో విమానాలు మళ్లీ ఎగిరే సమయం వచ్చింది. మే 25 నుంచి విమానాల రాకపోకలను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

  • Share this:
    భారత్‌లో విమానాలు మళ్లీ ఎగిరే సమయం వచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చే సోమవారం (మే 25వ తేదీ) నుంచి విమానాల రాకపోకలను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సిద్ధంగా ఉండాలంటూ విమానయాన సంస్థలు, విమానాశ్రయలకు కేంద్రం సూచనలు ఇవ్వనుంది. అయితే, కొన్ని షరతులు పెట్టే అవకాశం ఉంది. కరోనా వైరస్ రాకుండా విమానాల్లో కూడా సామాజిక దూరం పాటించేలా షరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ‘దేశీయంగా విమానాల ఆపరేషన్స్ మే 25 నుంచి ప్రారంభం అవుతాయి. అయితే, కొన్ని పద్ధతులు ఉంటాయి. అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు ఆపరేషన్స్ ప్రారంభించాల్సిందిగా మే 25వ తేదీలోపు ఆదేశాలు వస్తాయి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా జారీ చేస్తుంది.’ అంటూ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: