Flight Ticket Prices: పెరగనున్న విమాన టికెట్ల ధరలు... ప్రయాణికులపైనే భారం

పెరగనున్న విమాన టికెట్ల ధరలు... ప్రయాణికులపైనే భారం (image credit - twitter)

Flight Ticket Prices: అదనంగా ఆదాయం కావాలనుకుంటే చాలు... ధరలు పెంచడమే మార్గంగా భావిస్తున్నాయి ఎయిర్ లైన్స్ సంస్థలు. తాజా పిడుగు పడేందుకు కారణం అవుతున్న అంశమేంటి?

  • Share this:
    దేశీయ విమానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఓ పిడుగు లాంటి వార్త చెప్పింది. ఏంటంటే... దేశీయ విమానాల లోయర్ ఎయిర్‌ ఫేర్ బ్యాండ్‌ను 5 శాతం పెంచుతున్నట్లు తెలిసింది. ఈ సంవత్సరంలో ఇది రెండో పెంపు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఓసారి ఇలాగే దేశీయ విమానాల ఫేర్ లిమిట్స్ పెంచింది. ఇప్పుడు రెండోసారి దేశీయ విమానాల్లో టికెట్ల ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. విమానాల ఇంధన (Aviation Turbine Fuel) ధరలు కంటిన్యూగా పెరుగుతున్నాయి. అందువల్ల దిగువ స్థాయి ఛార్జీల (lower fare band)ను 5 శాతం పెంచుకోవచ్చనే నిర్ణయం తీసుకున్నాం. ఎగువ స్థాయి ఛార్జీల్లో మార్పు ఉండదు. రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఒక నెలలో... మూడు సార్లు... 3.5 లక్షలు దాటితే... వంద శాతం ఆపరేషన్స్ జరిపేందుకు అనుమతి ఇస్తాం అని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.


    ట్విట్టర్‌లో మంత్రి హర్దీప్ సింగ్ పురి... మరో విషయం కూడా చెప్పారు. "కొన్ని రోజులుగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు తప్పనిసరిగా RT-PCR టెస్ట్ చేయించుకున్న రిపోర్టు చూపించాలని కండీషన్ పెడుతున్నాయి. ఈ కండీషన్ల వల్ల ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అందుకే మేము... అనుమతించదగ్గ పరిమితిని 80 శాతానికి పరిమితం చేస్తున్నాం" అని తెలిపారు.

    ఫిబ్రవరిలో ఇలాగే ఇంధన వ్యయాల ధరలు పెరగడంతో... కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసుల ఎగువ స్థాయి, దిగువ స్థాయి ఛార్జీల పరిమితిని 10-30 శాతానికి పెంచింది. ఇప్పుడు ఎగువ స్థాయి పరిమితిని మార్చట్లేదు.


    గతేడాది మే నెలలో కేంద్ర విమానయాన శాఖ... దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినప్పుడు... దేశీయ విమాన సర్వీసుల రూట్లు, ఫ్లైట్ ప్రయాణ కాలం అన్నింటినీ లెక్కలోకి తీసుకొని... ఏడు బ్యాండ్లుగా విభజించి... ధరలపై పరిమితులు పెట్టింది. మొదటి బ్యాండ్ అనేది... 40 నిమిషాల లోపే ప్రయాణం పూర్తయ్యే విమానం. ఇప్పుడు దాని దిగువ స్థాయి టికెట్ ధర శుక్రవారం నాటికి రూ.2,310కి చేరింది. ఇక 180 నుంచి 120 నిమిషాలపాటూ ప్రయాణించే అత్యధిక స్థాయి బ్యాండ్ విమానాల్లో దిగువ స్థాయి పరిమితి రూ.7,560కి చేరింది.

    ఇది కూడా చదవండి: World Happy Day: ప్రపంచంలో ఆనందంగా ఉండే దేశం అదే... భారత్ స్థానం ఎంతంటే...

    ఇండియాలో కరోనా కారణంగా మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు. ఐతే... ప్రత్యేక ఇంటర్నేషనల్ విమానాలు మాత్రం... జులై 2020 నుంచి ఎయిర్ బబుల్ సౌకర్యాలతో నడుస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: