కరోనా వైరస్ దెబ్బ నుంచి దేశంలో విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోంది. వైరస్ ప్రభావం తగ్గడం, నిబంధనల్లో సడలింపులు రావడంతో విమాన ప్రయాణికుల (Flight Offers) సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ తొలి ఆరు రోజుల్లో రోజుకు సుమారు 2 లక్షల మందికి పైగా విమాన ప్రయాణాలు (Flight Journey) చేశారు. ఇలా ప్రయాణికుల సంఖ్య పెరగడం వరుసగా ఇది రెండో నెల. ఆగస్టులోనూ విమాన ప్రయాణాలు బాగానే జరిగాయి. మొత్తంగా ఆగస్టులో దేశంలో 57,498 విమానాల్లో 65,26,753 మంది ప్రయాణించారు. గత నెలతో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
ఆగస్టు ప్రారంభంలో తీసుకొచ్చిన ఓ నిబంధన వల్ల సెప్టెంబర్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ప్రయాణానికి 30 రోజుల ముందుగానే టికెట్ తీసుకునే వారికి తక్కువ ధరల్లో టికెట్లు ఇవ్వొచ్చని ప్రభుత్వం చెప్పింది. మినిమమ్ ఫేర్స్నే ఉంచాలని విమాన సంస్థలకు చెప్పింది. దీంతో చార్జీల్లో డిస్కౌంట్లతో పాటు ఆఫర్లు కూడా సంస్థలు ఇవ్వొచ్చు. దీంతో ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకే వస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే విమాన ప్రయాణాలను మరింత చౌక చేసే మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేస్తే సామాన్యులకు విమాన ప్రయాణం మరింత చేరువవుతుంది. అవేంటంటే..
Yono SBI App: ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని యోనో లైట్ యాప్‌లో పొందండి ఇలా
ప్రయాణ తేదీ కంటే 30 రోజుల ముందు విమాన టికెట్లు బుక్ చేసుకుంటే ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దాదాపు ప్రస్తుత ధరల కంటే సగానికే లభిస్తున్నాయి. అక్టోబర్‌లో ముంబై నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణానికి ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే.. ధర రూ.1,937గా ఉంది. అదే ఇప్పటికిప్పుడు ప్రయాణించాలంటే టికెట్ ధర దాదాపు రూ.5,310గా ఉంది. ఢిల్లీ – కొచ్చికి ఇప్పుడు ప్రయాణించాలంటే రూ.7,820 చెల్లించాల్సి ఉండగా.. అదే 30 రోజుల ఫేర్ లిమిట్ విండోలో టికెట్ ధర రూ.3,307 మాత్రమే ఉంది. బెంగళూరు-గువహటి, ఢిల్లీ-చెన్నై, బెంగళూరు-లక్నో అలా అన్ని విమాన టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఇదే విధంగా ఉంది.
LIC PAN Link: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే మీ పాన్ నెంబర్ లింక్ చేయండి
ప్రయాణ సమయం దగ్గర పడుతున్నప్పుడు విమాన సంస్థలు టికెట్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే విమాన సంస్థలు టికెట్ ధరలు ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టికెట్ బుకింగ్స్ ఎక్కువ కాకున్నా ప్రయాణికులను ఆకర్షించేందుకు విమాన సంస్థలు టికెట్ల ధరలను తగ్గించే వెసులుబాటు లేదు. 30 రోజుల విండో నిబంధనల వల్ల విమాన ప్రయాణికులు పెరగగా.. ఫ్లోర్ క్యాప్, సీలింగ్ క్యాప్ నిబంధనల్లో సడలింపులు తెస్తే టికెట్ ధరలు ఇంకా ప్రజలకు అందుబాటులో వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి
30 రోజుల కంటే తక్కువ సమయం ఉన్నా.. ప్రయాణ సమయం దగ్గర పడుతున్నా టికెట్ల ధరలను తగ్గించుకునే వెసులుబాటు విమానయాన సంస్థలకు ఇస్తే బాగుంటుందని అంటున్నారు. దీని ద్వారా విమాన చార్జీల ధరలు తగ్గుతాయి. ఎక్కువ టికెట్ ధరలతో కొందరే ప్రయాణించే కన్నా.. తక్కువ ధరలతో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తేనే మంచిదని విమానయాన సంస్థలు కూడా భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Flight Offers, Flight tickets