FLIGHT SOLD AT JUST RS 100 THIS BRITISH AIRWAYS PLANE IS NOW EARNING CRORES OF MONEY BY HOSTING PARTIES SK
Viral Story: రూ.100కే విమానం కొన్నాడు.. ఇప్పడు దానితోనే కోట్లు సంపాదిస్తున్నాడు..
Viral Story: రెస్టారెంట్‌కు వచ్చే వారి సంఖ్య బాగా పెరగడంతో.. ఆయనకు డబ్బులు బాగా వస్తున్నాయి. మూడు పువ్వులు.. ఆరుకాయలుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. మరి ఈ హోటల్లో గడపాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
Viral Story: రెస్టారెంట్‌కు వచ్చే వారి సంఖ్య బాగా పెరగడంతో.. ఆయనకు డబ్బులు బాగా వస్తున్నాయి. మూడు పువ్వులు.. ఆరుకాయలుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. మరి ఈ హోటల్లో గడపాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ రోజుల్లో పిల్లలు ఆడుకునే బొమ్మ విమానం కావాలన్నా వందల రూపాయలు ఖర్చు చేయాలి. ఇంకా గాల్లో విమానంలో ప్రయాణించాలంటే వేలకు వేలు పోయాలి. ఇక ఒక విమానం సొంతంగా ఉండాలంటే వందల కోట్లను వదులుకోవాలి. కానీ ఓ వ్యక్తి మాత్రం కేవలం రూ.101కే విమానం (Airplane) కొనుగోలు చేశాడు. ఇంత తక్కువ రేటు అంటే.. ఏదో ఆడుకునే బొమ్మ అని అనుకునేరు. అది చాలా పెద్ద విమానం. బ్రిటిష్ ఎయిర్వేస్ (British Airways)కు చెందిన 747 విమానాన్ని ఆయన కారుచౌకగా కొనుగోలు చేశాడు. అంత తక్కువ ధరకు తీసుకున్న ఆ ఫ్లైటే.. ఇప్పుడు లక్షలు కుమ్మరిస్తోంది. కోట్లు సంపాదిస్తోంది.
గత ఏడాది కరోనా సమయంలో ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం రిటైర్ అయింది. ఆ తర్వా త షెడ్డుకే పరిమితమయింది. ఖాళీగా ఉన్న ఆ విమానాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ అమ్మకానికి పెట్టింది. చాలా తక్కువ ధరకు అమ్మేందుకు నిర్ణయించింది. చివరకు కాట్స్వోల్డ్ ఎయిర్‌పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుజనా హార్వే రూ.102 (ఒక యూరో) చెల్లించి కొన్నేళ్ల క్రితం ఆ విమానాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం దాని లుక్‌ని ఆయన పూర్తిగా మార్చేశారు. దాదాపు రూ.5 కోట్ల మేర ఖర్చుపెట్టి మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత విలాసవంతమైన బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేశారు. ప్రైవేట్ మీటింగ్‌లకు అద్దెకు ఇస్తున్నారు.
విమానంలో ఉన్న ఈ బార్ అండ్ రెస్టారెంట్ చుట్టు పక్కల వారిని ఎంతో ఆకట్టుకుంటోంది. బయటే కాదు లోపల.. 5 స్టార్ హోటల్‌కు ఏమాత్రం తక్కువ కాదు. కంఫర్టబుల్ సీటింగ్, మంచి ఆంబియెన్స్తో వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది.దీనిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. ఆ రెస్టారెంట్లో గడిపేందుకు పోటీ పడుతున్నారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి సంఖ్య బాగా పెరగడంతో.. ఆయనకు డబ్బులు బాగా వస్తున్నాయి. మూడు పువ్వులు.. ఆరుకాయలుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. మరి ఈ హోటల్లో గడపాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇందులో గంట సేపు గడిపేందుకు ఏకంగా రూ.1 లక్ష చార్జ్ చేస్తున్నారు. రోజుకు 5 గంటల పాటు రెంట్ ఇచ్చినా.. సింపుల్‌గా ప్రతి రోజు రూ.5 లక్షలు వస్తాయి. మొత్తంగా ఆ విమానమే అతడికి బంగారు బాతుగుడ్డులా మారింది. 100కు కొన్న ఫ్లైట్.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది. అలా ఒక్క ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.