సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నది చాలామందికి ఓ కల తగిన స్థలం ఉన్నాసరే అనుమతుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. ఇండిపెండెంట్ ఇల్లు హైదరాబాద్ పట్టణంలో పూర్తయ్యేసరికి కోటి దాటడం ఖాయం. ఇక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటే నగర శివార్లలో 60 లక్షలకు పైనే ఉంది. అలాంటిది కేవలం 18 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్ వచ్చేస్తే..అంతకన్నా మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది. నిజానికి కరోనా నుంచి రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిగా పుంజుకొని స్థిరంగా కొనుగోళ్లను పెంచుకుంటోంది. గత నెలరోజులుగా నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ప్లాట్స్, ఫ్లాట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊపొచ్చింది.
ఇదిలా ఉంటే దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. మౌలాలి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఏ.ఎస్.రావునగర్, కొంపల్లి, శామీర్‌పేట, దమ్మాయిగూడెం, కాప్రా వరకు బహుళ అంతస్తుల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. భాగ్య నగరంలోని ప్రైమ్ లొకేషన్ గా పేరొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కేవలం 45 నిమిషాల డ్రైవ్ లో సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కాప్రా ప్రాంతంలో అనేక రెసిడెన్షియల్ ప్రాజెక్టులు సిటీలోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.20–50 వేల లోపు వేతనంతో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు ఈ ప్రాంతంలో ఫ్లాట్ పొందేందుకు సువర్ణావకాశం అనే చెప్పాలి. ఇక్కడ రెండు పడక గదుల ఫ్లాట్స్. 580 నుంచి 865 SQF విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ధర రూ.18 లక్షల నుంచి 40 లక్షల వరకూ పలుకుతోంది. సైనిక్‌పురి, ఈసీఐఎల్, తిరుమలగిరి క్రాస్ రోడ్, తార్నాక వంటి ప్రాంతాలకు విరివిగా కాప్రా ప్రాంతానికి కనెక్టివిటీ ఉంది. ఇక ఈ ప్రాంతంలో చక్కటి ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్, అలాగే కేంద్ర పారిశ్రామిక సంస్థలకు అత్యంత సమీపంలో ఉంది.
ఇక ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలకు బాటలు పడుతున్నాయి. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్కు, ఉప్పల్ ఐటీ సెజ్, హబ్సిగూడలో జెన్ ప్యాక్ట్ కంపెనీల రాకతో ఈ ప్రాంతం ఐటీ హబ్‌గా మారుతున్నది. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.
రూ.18 లక్షల్లో.. పీఎంఏవై పథకం సబ్సిడీ కూడా లభిస్తుంది. దీంతో అద్దె ఇంటికి చెల్లించే అద్దెతోనే మీరు ఈఎంఐ కట్టి సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మీ బడ్జెట్ కాస్త పెంచుకోగలిగితే మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కొదవేలేదు. ప్రస్తుతం వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో అపార్ట్ మెంట్ ధరలు చుక్కలను అంటుుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు ఈస్ట్ సైడ్ చూస్తున్నారు. దీంతో కరీం నగర్ రహదారి, వరంగల్ రహదారులే దిక్కుగా మారాయి. అంతేకాదు ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కూడా సొంతింటిని కొనుగోలు చేసేవారిని ఆకర్షిస్తున్నాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.