Flats At 25 Lakhs: హైదరాబాద్ లో సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. అయితే పెరుగుతున్న ధరలతో పేద మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడైనా సరే 2 బీహెచ్‌కే అద్దె రూ. 8–12 వేల వరకూ ఉంటోంది. దీనికి అదనంగా రూ. 2–4 వేలు చెల్లించే స్తోమత మీకుందా? అయితే మీరిక అద్దె ఇంట్లో ఉండక్కర్లేదు. ఎంచక్కా సొంతింట్లో హాయిగా ఉండొచ్చు. అవును నిజమే. ప్రస్తుతం హోమ్ లోన్స్ కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గించేసింది. దీంతో EMIలు కూడా భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పలు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు అందిస్తున్న కనిష్ట హోమ్ లోన్ వడ్డీరేటు ( Minimum home loan interest rate) 6.70 శాతంగా ఉంది. దీంతో ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు సైతం సొంతిల్లు కొనుగోలు చేసేందుకు మార్గం ఈజీ అయ్యింది. అయితే జంటనగరాల్లో ఫ్లాటు కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 40 నుంచి రూ.60 లక్షల దాకా ఖర్చు అవుతోంది. అయితే మీ బడ్జెట్లో 2 BHK ఫ్లాట్ కేవలం 25 లక్షలకే లభిస్తే అదృష్టంగా భావిస్తున్నారా...అయితే నగరంలోనే ఈ తరహా ప్రాజెక్టులు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రస్తుతం హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. అయితే నగరానికి అత్యంత సమీపంలోనే HMDA లిమిట్స్ లోని గాగిల్లా పూర్ ప్రాంతంలో 2BHK Flats కేవలం రూ.25 లక్షల రేంజులో లభిస్తున్నాయి. అది కూడా అండర్ కన్ స్ట్రక్షన్ లో ఉన్న కొత్త ఫ్లాట్స్ కావడం విశేషం. సికింద్రబాద్ స్టేషన్ నుంచి కేవలం 45 నిమిషాల దూరంలో, జీడిమెట్ల ప్రాంతం నుంచి కేవలం 20 నిమిషాల డ్రైవ్ కు దూరంలో ఉన్న గాగిల్లా పూర్ ప్రాంతంలో కొత్తగా అపార్ట్ మెంట్లు వెలుస్తున్నాయి. వీటి ధరలో ఇతర ప్రాంతాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ పండితులు అంటున్నారు.
గాగిల్లా పూర్ ప్రాంతం విశేషాలివే...
ఒక వేళ మీ బడ్జెట్ పాతిక లక్షలే అయితే గాగిల్లాపూర్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అనేక పరిశ్రమలకు నిలయంగా వెలసిన జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాలకు గాగిల్లాపూర్ కేవలం 20 నిమిషాల దూరంలో ఉండగా, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కేవలం 40 నిమిషాల దూరంలోనే ఉంది. నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గాగిల్లా పూర్ ప్రాంతం సమీపంలో స్కూల్స్, కాలేజీలతో, పాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అటు కొత్తగా వెలుస్తున్న షాపింగ్ మాల్స్, అలాగే మల్టీప్లెక్స్ లు వెలియడంతో ఈ ప్రాంతం ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు చక్కటి కేరాఫ్ గా నిలిచింది.
ఎమినిటీస్ ఇవే...
కేవలం రూ. 25 లక్షలకే ఈ ప్రాంతంలో 900 sq ft నుంచి 1200 SQ.ft 2 BHK ఫ్లాట్స్ లభిస్తున్నాయి. అంతేకాదు అన్ని ప్రముఖ బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు లభిస్తున్నాయి. ఇక కేవలం ఫ్లాట్ మాత్రమే కాదు...Gym, Swimming pool, Garden, Kids area, Sports Area కూడా ఇంత తక్కువ ధరకే ఎమినిటీస్ లభించడం బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం అద్దె ఇల్లు వదిలి కాస్త ధైర్యం చేస్తే...హైదరాబాద్ లో సొంతిల్లు మీ సొంతం అవ్వడం ఖాయం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.