ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్... రెండు వడ్డీల మధ్య తేడాలేంటీ?

బ్యాంకు మీకు రెండేళ్ల 8.5-8.55% ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌‌కు రూ.30 లక్షల ఆఫర్ చేస్తుంది. మీరు రూ.25 లక్షలు తీసుకుంటారు. రెండేళ్ల ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ అని ముందే చెప్పారు కాబడ్డి రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్‌ని రీసెట్ చేస్తుంది బ్యాంకు.

news18-telugu
Updated: January 9, 2019, 4:38 PM IST
ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్... రెండు వడ్డీల మధ్య తేడాలేంటీ?
ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్... రెండు వడ్డీల మధ్య తేడాలేంటీ?
  • Share this:
అందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా అప్పులు చేస్తారు. బ్యాంకులైనా, ప్రైవేట్ సంస్థల్లో అయినా అప్పు తీసుకోవడం మామూలే. ఇల్లు, కారు, చదువులు, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం అప్పులు చేయడం తప్పు. ఈ అప్పులపై ఫిక్స్‌‌డ్ ఇంట్రెస్ట్ రేట్(స్థిర వడ్డీ రేటు), ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్(మారే వడ్డీ రేటు) వసూలు చేస్తుంటాయి బ్యాంకులు ప్రైవేట్ సంస్థలు. అయితే అప్పు తీసుకునేవాళ్లు ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంచుకోవాలా? లేక ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంచుకోవాలా అన్న డైలమాలో ఉంటారు. ఆ రెంటు వడ్డీలకు మధ్య తేడాలు తెలియక అయోమయానికి గురవుతుంటారు. అసలు ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటీ? ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటీ? ఈ రెండింటి మధ్య తేడాలేంటీ? తెలుసుకోండి.

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ అంటే ఏంటీ?ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ను స్థిర వడ్డీ రేటు అని కూడా అంటారు. ఇందులో మీరు రుణ కాల వ్యవధి మొత్తం ఒకే వడ్డీ రేటుతో అప్పు తీర్చాల్సి ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా, తగ్గినా మీకు సంబంధం ఉండదు. మీరు అప్పు తీసుకునే సమయంలో ఏ వడ్డీకి ఒప్పందం కుదుర్చుకుంటారో అంతే వడ్డీకి అప్పు తీర్చేస్తే చాలు. ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లు ఎంచుకునే ముందు నియమనిబంధనల్ని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌పై అప్పు తీసుకున్నా నియమ నిబంధనల్లో వడ్డీని బ్యాంకులు రీసెట్ చేయడం లేదా ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ను కొన్నేళ్ల తర్వాత ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్‌గా మార్చడం అన్న నిబంధన ఉంటుంది.

Fixed interest rate vs floating interest rate, What is Fixed interest rate, Fixed interest rate meaning, what is floating interest rate, floating interest rate meaning, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ అంటే ఏంటీ?, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ లాభాలు, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ నష్టాలు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్‌ లాభాలు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్‌ నష్టాలు,

ఉదాహరణకు బ్యాంకు మీకు రెండేళ్ల 8.5-8.55% ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌‌కు రూ.30 లక్షల ఆఫర్ చేస్తుంది. మీరు రూ.25 లక్షలు తీసుకుంటారు. రెండేళ్ల ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ అని ముందే చెప్పారు కాబడ్డి రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్‌ని రీసెట్ చేస్తుంది బ్యాంకు. అప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) ఆధారంగా మీ వడ్డీ రేట్ నిర్ణయింస్తుంది బ్యాంకు. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందన్నది చెప్పలేం.

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌తో లాభమేంటీ?


ఫిక్స్ ఇంట్రెస్ట్ రేట్‌తో మీరు లోన్ తీసుకుంటే ఒకవేళ రెండుమూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లు పెరిగితే మీకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఎందుకంటే మీరు ముందే ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంచుకుంటారు కాబట్టి కొత్త వడ్డీ రేటుతో మీకెలాంటి సంబంధం ఉండదు.

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌తో నష్టమేంటీ?


ఒకవేళ మీరు లోన్ చెల్లిస్తున్న కాలంలో వడ్డీ రేట్లు తగ్గితే అవి మీకు వర్తించవు. ఎందుకంటే మీరు ఫిక్స్‌డ్ రేట్ ఎంచుకున్నారు కాబట్టి స్థిర వడ్డీ రేటుపైనే లోన్ మొత్తం చెల్లించాలి.

Fixed interest rate vs floating interest rate, What is Fixed interest rate, Fixed interest rate meaning, what is floating interest rate, floating interest rate meaning, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ అంటే ఏంటీ?, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ లాభాలు, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌ నష్టాలు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్‌ లాభాలు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్‌ నష్టాలు,

ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటీ?


ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్‌నే మారే వడ్డీ రేటు అని కూడా అంటారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని బట్టి రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) మారినప్పుడల్లా వడ్డీ రేట్లు మారుతాయి. దాన్నే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు.

ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లాభాలేంటీ?


ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు ఫిక్స్‌డ్ వడ్డీ రేట్ల కన్నా 1-2% తక్కువగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు మీ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి.

ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ నష్టమేంటీ?


ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం లోన్ తీసుకుంటే మీ ఈఎంఐ మారుతూ ఉంటుంది. దీని వల్ల మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవడంలో కాస్త ఇబ్బందవుతుంది. దానికి తోడు ఒకవేళ వడ్డీ రేట్లు బాగా పెరిగాయంటే దాని ప్రకారమే అప్పు తీర్చాలి.

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్... ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నది మీ అవసరాన్ని, మీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. అప్పు తీసుకునే ముందే ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రెట్లను జాగ్రత్తగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి:

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మారింది... కొత్త రేట్లు ఇవే

ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?

ITR Alert: మీ ఐటీఆర్‌లో హెచ్ఆర్ఏ ఎలా ప్లాన్ చేశారు?

కస్టమర్లకు ఎస్‌బీఐ కొత్త వార్నింగ్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

 
First published: January 9, 2019, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading