FIXED DEPOSITS HIGH INTEREST ON TAX SAVING FDS THESE ARE THE BANKS THAT OFFER INTEREST UP TO 6 75 PERCENT GH VB
Fixed Deposits: ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ.. 6.75% వరకు వడ్డీని అందిస్తున్న బ్యాంకులు ఇవే..
(ప్రతీకాత్మక చిత్రం)
కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న ప్రైవేట్ రంగ బ్యాంకులు ట్యాక్స్-సేవింగ్ ఎఫ్డీలపై ఏకంగా 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరి ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీ రేటును అందించే ఆ బ్యాంకులు ఇవే ఇప్పుడు చూద్దాం.
చాలామంది పన్ను ఆదా చేసే పెట్టుబడులను (Tax-Saving Investments) చివరి నిమిషం వరకు వాయిదా వేస్తారు. ప్రతిఏటా జనవరి, మార్చి నెలల వరకు ట్యాక్స్-సేవింగ్ ఇన్వెస్ట్మెంట్(Investment) చెయ్యనివారు చాలామంది ఉంటారు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఈ పెట్టుబడులను స్టార్ట్ చేయడం మంచి ఆర్థిక పద్ధతి. అయితే రిస్క్(Risk) నచ్చని పెట్టుబడిదారులు(Investors), తక్కువ పన్ను పరిధిలో ఉన్నవారు ట్యాక్స్-సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీలు- Tax Saving Fixed Deposits) చేసుకోవచ్చు. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న ప్రైవేట్ రంగ బ్యాంకులు(Private Banks) ట్యాక్స్-సేవింగ్ ఎఫ్డీలపై(Tax Saving FDs) ఏకంగా 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరి ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీ రేటును(Interest Rates) అందించే ఆ బ్యాంకులు ఇవే ఇప్పుడు చూద్దాం.
రూ.1.5 లక్షల వరకు పెట్టే పెట్టుబడుల కోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయవచ్చు. కానీ కేవలం పన్ను ఆదా కోసమే పెట్టుబడి పెట్టకండి. పెట్టుబడి పై రాబడి వచ్చేలా కూడా ప్లాన్ చేసుకోండి. ఇందుకు ఎఫ్డీలు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. ఈ ట్యాక్స్-సేవింగ్ ఎఫ్డీలకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుందని, ప్రిమెచ్యూర్ విత్‌డ్రాలు చేసే అవకాశం ఉండదని గమనించాలి.
- ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఏయూ స్మాల్ ఫైనాన్స్ (AU Small Finance Bank), సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ (Suryoday Small Finance Bank) బ్యాంకులు ట్యాక్స్-సేవింగ్ డిపాజిట్లపై 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ వడ్డీ రేటు ప్రకారం, మీరు పెట్టుబడి పెట్టిన రూ.1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ.2.10 లక్షలకు పెరుగుతుంది.
- ఇండస్ఇండ్ బ్యాంక్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ఇండ్ (Indusind) ట్యాక్స్-సేవింగ్ డిపాజిట్లపై 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన రూ. 1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ.2.07 లక్షలకు పెరుగుతుంది.
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్యాక్స్-సేవింగ్ డిపాజిట్లపై 6.4 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ. 1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ.2.06 లక్షలకు పెరుగుతుంది.
- ఆర్బీఎల్ బ్యాంక్
ఆర్బీఎల్ బ్యాంక్ (RBL Bank) ట్యాక్స్-సేవింగ్ డిపాజిట్లపై 6.3 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.05 లక్షలకు చేరుకుంటుంది.
- డ్యుయిష్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్
డ్యుయిష్ (Deutsche), డీసీబీ (DCB), ఐడీఎఫ్సీ ఫస్ట్ (IDFC First), యెస్ (Yes) బ్యాంకులు ట్యాక్స్-సేవింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.05 లక్షలకు చేరుకుంటుంది.
- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank) ట్యాక్స్-సేవింగ్ డిపాజిట్లపై 6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.02 లక్షలకు చేరుకుంది.
ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న ప్రైవేట్ బ్యాంకులు కొత్త డిపాజిట్లను పొందేందుకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC), రూ. 5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులకు హామీ ఇస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.