హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD interest: ఎఫ్‌డీ మెచూరిటీ గడువు ముగిసిందా... వెంటనే రెన్యువల్ చేసుకోవాల్సిందే!

FD interest: ఎఫ్‌డీ మెచూరిటీ గడువు ముగిసిందా... వెంటనే రెన్యువల్ చేసుకోవాల్సిందే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fixed Deposit interest: ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు ముగిశాక... రెన్యువల్ చేసుకోకపోతే... కొత్త సమస్యలు తప్పవు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రూల్స్ తెచ్చిందో తెలుసుకుందాం.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FD) విషయంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీలకు ఇచ్చే వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఎఫ్‌డీ చేసినందుకు ఇచ్చే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ ఎఫ్‌డీ మెచ్యూర్‌ అయ్యాక డబ్బులు రెడీమ్‌ చేసుకోకుండా బ్యాంకులోనే ఉంచేస్తే... వచ్చే వడ్డీలో మార్పు కనిపిస్తుంది. అంటే ఓవర్‌ డ్యూ ఎఫ్‌డీలకు ఇచ్చే వడ్డీ తగ్గుతుందన్నమాట. అసలేంటీ మార్పు, ఏ సందర్భంలో అమల్లో ఉంటుందో చూద్దాం. రిజర్వ్‌ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సాధారణ బ్యాంకులు, కో ఆపరేటివ్‌ బ్యాంకులకు సంబంధించి ఎఫ్‌డీల వడ్డీల్లో ఈ మార్పు అమల్లోకి వస్తుంది. టెర్మ్‌ డిపాజిట్‌ మెచ్యూర్‌ అయ్యాక... అవసరమైన ప్రొసీడింగ్స్‌ పూర్తి చేస్తే ఆ వ్యక్తి ఖతాలోకి డబ్బులు చేరిపోతాయి. ఒకవేళ ప్రొసీడింగ్స్‌ జరగకపోతే... ఆ డబ్బులు అలానే ఉండి సేవింగ్స్‌ అకౌంట్‌కి వచ్చేంత వడ్డీ మాత్రమే వస్తుంది. ఒక్కో బ్యాంకు సేవింగ్స్‌ అకౌంట్‌కి వడ్డీ ఒక్కోలా ఉండటం వల్ల ఇందులో తేడా కనిపిస్తుంది. అయితే కొత్త విధానంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి.

మార్చిన నిబంధనల ప్రకారం... మెచ్యూర్‌ అయిన అమౌంట్‌కు సేవింగ్స్‌ ఖాతా వడ్డీ... లేదంటే టెర్మ్‌ డిపాజిట్‌ (ముందుగా నిర్ణయించిన) వడ్డీలో ఏది తక్కువైతే అది ఇస్తారట. కాబట్టి... ఇకపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేటప్పుడు ఆ రెండు రకాల వడ్డీలపై ఓ కన్నేయాలి. కొత్త నిబంధనల వల్ల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీసీఐ బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకులు, అలాగే అన్ని కో- ఆపరేటివ్‌ బ్యాంకుల వినియోగాదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు తక్కువ వడ్డీలు ఇస్తున్న బ్యాంకుల వినియోగదారులు ఈ మార్పుతో ఇబ్బందులు పడతారు.

ఇది కూడా చదవండి: PPF Scheme: రోజూ రూ.416 సేవ్ చేస్తే... మీరే కోటీశ్వరులు..! ఈ విధంగా చేస్తే సాధ్యమే..

అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే వినియోగదారులు ఎఫ్‌డీల విషయంలో ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూర్‌ అయిన వెంటనే రెడీమ్‌ చేసుకొని... వెంటనే మరోసారి ఎఫ్‌డీ చేసుకోవడం మంచిది. అంతేకానీ... తర్వాత చూద్దాంలే అని అనుకుంటే వడ్డీ తక్కువగా వస్తుంది. ఎఫ్‌డీలు ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్‌లో చేస్తున్నారు కాబట్టి.. ఆన్‌లైన్‌ రిడంప్షన్‌ చాలా సులభం. మీ ఎఫ్‌డీ మెచూరిటీ డేట్‌ ఎప్పటి వరకు ఉందో ఓసారి చూసుకోండి మరి.

Published by:Krishna Kumar N
First published:

Tags: FD rates, Fixed deposits, Fixed deposits money, Hdfc, Icici bank, Rbi, Reserve Bank of India, Sbi

ఉత్తమ కథలు