హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank News: దసరా ముందు కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. 5 బ్యాంకుల కీలక నిర్ణయం!

Bank News: దసరా ముందు కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. 5 బ్యాంకుల కీలక నిర్ణయం!

 దసరా ముందు కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. 5 బ్యాంకుల కీలక నిర్ణయం!

దసరా ముందు కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. 5 బ్యాంకుల కీలక నిర్ణయం!

FD Rates | బ్యాంకులు వరుసపెట్టి ఖాతాదారులకు తీపికబురు అందిస్తున్నాయి. తాజాగా ఐదు బ్యాంకులు కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించాయి. పండుగ సీజన్ ముందు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Fixed Deposit| బ్యాంకులు డిపాజిట్‌దారులకు గుడ్ న్యూస్ అందించాయి. డిపాజిట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఏకంగా ఐదు బ్యాంకులు (Banks) ఎఫ్‌డీ రేట్లు పెంచేశాయి. బ్యాంకులు సాధారణంగా 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD Rates) సర్వీసులు అందిస్తూ ఉంటాయి. ఏ ఏ బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు పెంచాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో ఇప్పుడు ఈ బ్యాంక్‌లో 2.75 శాతం నుంచి 5.6 శాతం వరకు వడ్డీ వస్తుంది.

    మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఇకపై 3 శాతం నుంచి వడ్డీ వస్తుంది. గరిష్టంగా 6 శాతం వరకు వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా 6.65 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. 700 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.

    సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

    అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ కూడా బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్లు లేదా ఆపైన మొత్తంలోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. రేట్ల పెంపు తర్వాత ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా 6.9 శాతం వరకు వడ్డీ వస్తుంది.

    దసరా ధమాకా ఆఫర్.. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్!

    అంతేకాకుండా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచేసింది. బల్క్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఈ బ్యాంక్‌పై ఇకపై గరిష్టంగా 7.8 శాతం వరకు వడ్డీ రేటు పొందొచ్చు. ఇంకా మరో బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు పెంచేసింది. బంధన్ బ్యాంక్ కూడా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఈ బ్యాంక్ కూడా బల్క్ డిపాజిట్లపై రేట్లు పెంచింది. 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. కాగా రానున్న రోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ రెపో రేటు పెంచొచ్చనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణంగా తెలియజేస్తున్నారు. అందువల్ల ఇంకొంత కాలం ఆగి బ్యాంక్‌లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు ఎఫ్‌డీ చేస్తే టెన్యూర్ అయిపోయేంత వరకు వేచి ఉండాల్సిందే. వడ్డీ రేటు టెన్యూర్ మొత్తం స్థిరంగానే ఉంటుంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Banks, FD rates, Fixed deposits, Money, Personal Finance

    ఉత్తమ కథలు