హోమ్ /వార్తలు /బిజినెస్ /

Repo Rate: రెపో రేటు పెరగడంతో వారికి భారీగా లాభం... ఆర్థిక నిపుణుల విశ్లేషణ ఇదే

Repo Rate: రెపో రేటు పెరగడంతో వారికి భారీగా లాభం... ఆర్థిక నిపుణుల విశ్లేషణ ఇదే

Repo Rate: రెపో రేటు పెరగడంతో వారికి భారీగా లాభం... ఆర్థిక నిపుణుల విశ్లేషణ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Repo Rate: రెపో రేటు పెరగడంతో వారికి భారీగా లాభం... ఆర్థిక నిపుణుల విశ్లేషణ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 35 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెంచింది. రెపో రేటు పెరగడంతో వారికి భారీగా లాభం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేట్లు (Repo Rate) పెంచుతూ వస్తోంది. గతంలో వరుసగా మూడుసార్లు 50 బేసిస్ పాయింట్లు పెంచగా.. ఇప్పుడు 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో 6.25 శాతానికి చేరింది. ఈ ప్రభావం లోన్లు తీసుకునేవారికి కాస్త భారంగా మారనుండగా.. ఎఫ్‌డీ డిపాజిట్లకు మాత్రం తీపి కబురుగానే చెప్పవచ్చు. సెంట్రల్ బ్యాంక్ పాలసీ రెపో రేటును పెంచినప్పుడు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ రేట్లు రెండూ పెరిగే అవకాశం ఉంది. 2022 మే నుంచి ఆర్బీఐ పాలసీకి అనుగుణంగా బ్యాంకులు తమ ఎఫ్‌డి రేట్లను పోటాపోటీగా పెంచుతున్నాయి. ఈసారి 35 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపుకు అనుగుణంగా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను పెంచడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

6.25 శాతానికి వడ్డీ రేటు

డిసెంబర్ 7న జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. FY23లో ఇప్పటివరకు 225 బేసిస్ పాయింట్లకు రెపోరేటు పెరిగింది. ఇప్పుడు రెపో రేటు 6.25% కి చేరింది. 2018 ఆగస్టు తర్వాత రెపోరేటు అత్యధిక స్థాయికి చేరింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్దం వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్ అంతరాయం ఏర్పడింది. అంతేకాదు ఇంధన సంక్షోభాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్ బలపడటం, తీవ్రమైన ద్రవ్యోల్బణ ఒత్తిడి వంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితికి దారితీసింది. FY23 కోసం మేలో 40 bps మేర మొదటి రెపోరేటు పెంచాం. ఆ తర్వాత జూన్ నుంచి అక్టోబరు మధ్య వరుసగా మూడు పర్యాయాలు రెపోను 50 bps చొప్పున పెంచాం. ప్రస్తుతం డిసెంబర్ పాలసీలో భాగంగా తాజాగా 35 bps మాత్రమే పెంచామని చెప్పారు.

SBI Business Loan: వ్యాపారం చేయడానికి రూ.10 లక్షల వరకు ఎస్‌బీఐ లోన్... వివరాలివే

RBI ప్రకారం.. మే నుంచి అక్టోబర్ మధ్య తాజా, పాత డిపాజిట్లపై సగటు దేశీయ టర్మ్ డిపాజిట్ రేటు వరుసగా 150 bps, 46 bps పాయింట్ల మేర పెరిగింది. డిసెంబరులో ఎందుకు తక్కువగా రెపో రేటు పెరిగింది? ఎఫ్‌డీ డిపాజిట్లకు ఇది ఎలా కలిసొస్తుంది? వంటి అంశాలపై ఆర్థిక నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ పాలసీలో 35 బేసిస్‌ పాయింట్ల రెపోరేటును మాత్రమే పెంచడానికి వెనుక ఉన్న కారణం అక్టోబర్‌లో 7% కంటే తక్కువ CPI ద్రవ్యోల్బణం తగ్గడమేనని పేర్కొన్నారు. RBI రెపో రేటును తక్కువ పరిమాణంలో పెంచినప్పటికీ, ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయంతో రుణ రేట్లు, డిపాజిట్ రేట్లు రెండూ మున్ముందు పెరుగుతాయని భావిస్తున్నారు.

New Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1,25,000 వరకు పెన్షన్ ... కొత్త రూల్స్ ఇవే

ఎఫ్‌డీలు మరింత ఆకర్షణీయం

టైల్‌విండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గోయెల్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ఎఫ్‌డీ డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా మారుతాయని చెప్పారు. ప్రస్తుత వాతావరణంలో ప్రీమియం, నష్టాలు సమానంగా కొనసాగుతున్నాయన్నారు. పెట్టుబడిదారుల దృక్కోణంలో చూస్తే స్థిర -ఆదాయ పెట్టుబడిదారులు ఎఫ్‌డీలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైన వాటి నుంచి అధిక-వడ్డీ రేట్లు పొందుతారని పేర్కొన్నార. బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై డిసెంబరు పాలసీ రేట్ పెంపు ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుందో పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

First published:

ఉత్తమ కథలు