భారతదేశంలో పెట్టుబడులపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా యంగ్ ఇన్వెస్టర్స్(Investors) చాలామంది కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేశిస్తున్నారు. అలాగే సంప్రదాయ పెట్టుబడిదారులు డిపాజిట్ల పరిధిని దాటి వేరే ఆప్షన్లను వెతుకుతున్నారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్(Invest) చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని గుర్తించింది ఒక లేటెస్ట్ సర్వే. ఈ సంవత్సరం టాప్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రూమెంట్గా మ్యూచువల్ ఫండ్స్ నిలిచినట్లు గుర్తించింది ఇన్వెస్ట్మెంట్(Investment) సర్వీసెస్ కంపెనీ స్క్రిప్‌బాక్స్ (Scripbox). అదనపు మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది.
ఈ సర్వే కోసం స్క్రిప్‌బాక్స్ దేశవ్యాప్తంగా 620 మందికిపైగా వ్యక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వీటిని విశ్లేషించిన తర్వాత.. ఇప్పుడు చాలామంది పెట్టుబడుల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నారని, ఈ ధోరణిని సెల్ఫ్ గ్రోత్‌గా భావిస్తున్నారని సర్వే తెలిపింది. ఆర్థికంగా నియంత్రణ సాధించడంతో కలిగే ప్రయోజనాలపై కూడా సర్వేలో పాల్గొన్నవారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం అనేది భవిష్యత్తు గురించి విశ్వాసాన్ని పెంపొందిస్తుందని చాలామంది చెప్పారు.
* సర్వేలో తేలిన విషయాలు
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 27 శాతం మంది గత సంవత్సరంలో తమ ఖర్చును తగ్గించుకున్నట్లు పేర్కొన్నారు. 50 శాతం మంది తమ ఆదాయంలో 10 నుంచి 30 శాతం మధ్య పొదుపు చేస్తున్నారు. 23 శాతం మంది గత సంవత్సరంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. 20 శాతం మంది అప్పటికే చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లను పెంచారు.
సర్వేలో భాగమైన 57 శాతం మంది తమను సేవర్స్‌గా భావిస్తున్నారు. 43 శాతం మంది యాక్టివ్ ఇన్వెస్టర్స్‌గా మారినట్లు తెలిపారు. 60 శాతం మంది ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, మహమ్మారి తెచ్చిన అనిశ్చితి వంటి సవాళ్ల కారణంగా పెట్టుబడి ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పారు. 30 శాతం మంది 2021 మాదిరిగానే ఈ సంవత్సరం తమ టాప్ 2 ఆర్థిక లక్ష్యాలలో ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 27 శాతం మంది రిటైర్మెంట్, పిల్లల విద్య కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రిటైర్మెంట్ ప్లానింగ్‌తో పోలిస్తే గత సంవత్సరం ఎక్కువ మంది పిల్లల విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం అది రెండో స్థానానికి చేరింది.
* మారిన మహిళల ఆలోచనలు
పురుషులు, మహిళలు ఆర్థిక లక్ష్యాలను ఎంచుకునే విధానంలోని వ్యత్యాసాన్ని కూడా సర్వే వివరించింది. 36 శాతం మంది మహిళలు పిల్లల విద్య కోసం పొదుపు చేయడం మొదటి రెండు ప్రాధాన్యతలలో ఒకటిగా పేర్కొన్నారు. మహిళలు 2021 నుంచి ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. వీరు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. గత 4 ఏళ్లలో మహిళలు పెట్టుబడి పెట్టిన మొత్తం రెండింతలు పెరిగిందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అయితే పిల్లలవిద్యతో పోలిస్తే పదవీ విరమణపైనే 42 శాతం మంది పురుషులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 28 శాతం మందే పిల్లల విద్య కోసం శ్రద్ధ తీసుకుంటున్నారు.
సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడారు స్క్రిప్‌బాక్స్ వ్యవస్థాపకుడు, CEO అతుల్ షింఘల్. పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం విభిన్నమైనవని చెప్పారు. పొదుపు చేయడం మొదటి అడుగని, అయితే సంపదను సృష్టించడానికి పెట్టుబడినే ఎంచుకోవాలని తెలిపారు. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి పెట్టుబడి సరైన మార్గమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్చేస్తుండటం కనిపిస్తోందని, ఇది మంచి పరిణామమని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా డబ్బును సంపాదించడంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earn money, Investments, Investors, Survey