news18-telugu
Updated: October 28, 2020, 3:10 PM IST
Fixed Deposit: సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
డబ్బులు పొదుపు చేయడానికి ఉన్న మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు బ్యాంకులు, పైనాన్స్ సంస్థల్ని బట్టి మారుతుంటాయి. అంతేకాదు... సాధారణ ప్రజలతో పోలిస్తే వృద్ధులకు ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి బ్యాంకులు. ఏ డిపాజిట్ స్కీమ్ అయినా వృద్ధులకు కనీసం అర శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు, చిన్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. అయితే వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ కోసం ఆశపడితే అసలు కూడా రిస్కులో పడొచ్చు. అందుకే బ్యాంకు చరిత్ర, ప్రస్తుత పనితీరు లాంటి వివరాలు తెలుసుకున్న తర్వాతే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఇక ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఏవో తెలుసుకోండి.
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభంEPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి ఇలా
ఒక ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్
ఇండస్ఇండ్ బ్యాంక్- 7.50%
ఆర్బీఎల్ బ్యాంక్- 7.35%
డీసీబీ బ్యాంక్- 7.00%ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 7.00%
బంధన్ బ్యాంక్- 6.50%
రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
ఇండస్ఇండ్ బ్యాంక్- 7.50%
ఆర్బీఎల్ బ్యాంక్- 7.35%
డీసీబీ బ్యాంక్- 7.30%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 7.00%
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 7.00%
మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
ఆర్బీఎల్ బ్యాంక్- 7.65%
డీసీబీ బ్యాంక్- 7.45%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ -7.25%
ఇండస్ఇండ్ బ్యాంక్- 7.25%
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.55%
ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
డీసీబీ బ్యాంక్- 7.45%
ఇండస్ఇండ్ బ్యాంక్- 7.25%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 7.00%
ఆర్బీఎల్ బ్యాంక్- 7.00%
బంధన్ బ్యాంక్- 6.50%
LIC Policy: రూ.121 పొదుపు చేస్తే రూ.27 లక్షలు రిటర్న్స్... ఈ పాలసీ మీకు తెలుసా?
PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? తెలుగులో తెలుసుకోండి ఇలా
కనీసం ఏడు రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి వారికి వృద్ధాప్యంలో వడ్డీ డబ్బులు ఆసరాగా నిలుస్తాయి. వడ్డీని నెలకోసారి స్వీకరించే సదుపాయం కూడా ఉంటుంది. లేదా మెచ్యూరిటీ సమయంలో వడ్డీ పొందొచ్చు. బ్యాంకులు నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీబీ ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ.50,000 వరకు రిటర్న్స్ పొందితే పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై టీడీఎస్ కూడా ఉండదు. టీడీఎస్ మినహాయింపు పొందేందుకు సీనియర్ సిటిజన్లు ఫామ్ 15హెచ్ సమర్పించాల్సి ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. అయితే ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్స్‌కు పెనాల్టీ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాలెన్స్ నుంచి పెనాల్టీ డిడక్ట్ చేస్తుంది బ్యాంకు. కొన్ని బ్యాంకుల్లో ఈ పెనాల్టీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంటుంది. లోన్ కూడా తీసుకోవచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
October 28, 2020, 3:10 PM IST