Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Fixed Deposits: ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు...ఓ లుక్కేయండి...

    సాధారణ సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే ఎఫ్డీలు మంచి వడ్డీ రేట్లను అందిస్తాయి. కానీ ఇవి మెచ్యూరిటీ పీరియడ్ నిబంధనతో ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఎఫ్డీ సర్టిఫికెట్లపై లోన్లు కూడా అందిస్తాయి.

    news18-telugu
    Updated: October 19, 2020, 9:59 PM IST
    Fixed Deposits: ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు...ఓ లుక్కేయండి...
    ప్రతీకాత్మకచిత్రం
    • Share this:
    మనకు అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో నష్టభయం తక్కువగా ఉండేది ఫిక్స్డ్ డిపాజిట్లపైనే. బ్యాంకులు, NBFCలు ఫిక్స్ డ్ డిపాజిట్లను అందిస్తాయి. సాధారణ సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే ఎఫ్డీలు మంచి వడ్డీ రేట్లను అందిస్తాయి. కానీ ఇవి మెచ్యూరిటీ పీరియడ్ నిబంధనతో ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఎఫ్డీ సర్టిఫికెట్లపై లోన్లు కూడా అందిస్తాయి. కరోనా నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను తగ్గించినా, కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎఫ్డీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోన్న బ్యాంకుల జాబితా..

    1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    ఎస్ బీఐలో ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు చేసే ఎఫ్డీలపై 2.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు చేసే టర్మ్ డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ ఇస్తుంది. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఉండే ఎఫ్డీలపై వడ్డీ రేటును 4.4 శాతంగా నిర్ణయించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ 4.9 శాతం. మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు చేసే ఎఫ్డీలపై ఈ బ్యాంకు 5.3 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదు నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 5.4 శాతం వడ్డీ ఇస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ విభాగాల్లో సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అదనంగా 50 బిపిఎస్ వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉన్న ఎఫ్డీలపై 3.4 శాతం నుంచి 6.2 శాతం వడ్డీ రేట్లను పొందుతారు.

    2. HDFC బ్యాంక్
    ఏడు నుంచి 29 రోజుల వరకు చేసే డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 నుంచి 90 రోజుల వరకు మెచూరిటీ ఉండే డిపాజిట్లపై మూడు శాతం వడ్డీ లభిస్తుంది. 91 రోజుల నుంచి ఆరు నెలల వరకు చేసే ఎఫ్డీలపై 3.5 శాతం, ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపు ఉండే ఎఫ్డీలపై 4.4 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. ఒక సంవత్సరం మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 4.9 శాతం, రెండేళ్ల మెచూరిటీ ఉండే డిపాజిట్లపై ఐదు శాతం వడ్డీని అందిస్తుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 5.15 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు చేసే వాటిపై వడ్డీ రేటు 5.30 శాతంగా ఉంటుంది. ఐదు నుంచి పదేళ్ల వరకు మెచూరిటీ ఉండే డిపాజిట్లు 5.50 శాతం వడ్డీని అందిస్తాయి. ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 15 నుండి అమలులో ఉన్నాయి.

    3. పంజాబ్ నేషనల్ బ్యాంక్
    ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకు మూడు నుంచి 5.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. 7-45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై పీఎన్బీ మూడు శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం లోపు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై వడ్డీ 4.5 శాతం, ఒకటి నుంచి మూడు సంవత్సరాల మెచూరిటీ ఉంటే టర్మ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీని ఇస్తుంది. ఐదు నుంచి పదేళ్ల మెచూరిటీ ఉండే డిపాజిట్లపై బ్యాంకు అత్యధికంగా 5.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులో ఉన్నాయి.

    4. కెనారా బ్యాంక్
    ఈ రేట్లు అక్టోబర్ 1 నుండి అమల్లో ఉన్నాయి. 7 నుంచి 45 రోజుల మెచూరిటీ ఉండే టర్మ్ డిపాజిట్లపై కెనరా బ్యాంక్ మూడు శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 46 నుంచి 90 రోజులు మెచూరిటీ ఉండే డిపాజిట్లపై నాలుగు శాతం, 91 రోజుల నుంచి 179 రోజులు ఉండే డిపాజిట్లపై 4.05శాతం, 180 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచూరిటీ ఉండే డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల లోపు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై ఈ బ్యాంకు ఇస్తోన్న వడ్డీ రేటు 5.25 శాతం. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు మూడు నుంచి పదేళ్ల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 5.35 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.

    5. బ్యాంక్ ఆఫ్ బరోడా
    ఈ రేట్లు అక్టోబర్ మూడు నుండి అమల్లో ఉన్నాయి. ఏడు నుంచి 45 రోజుల వరకు మెచ్యూరిటీ ఉండే డిపాజిట్లపై ఈ బ్యాంకు 2.9 శాతం వడ్డీని ఇస్తోంది. 46 నుంచి 180 రోజుల మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 3.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 181 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచూరిటీ ఉండే షార్ట్ టర్మ్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ 4.4 శాతం వడ్డీని ఇస్తుంది. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ 4.9 శాతం. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 5.1 శాతం వడ్డీ రేటు ఉంది. మూడు నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉండే డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ రేటును కస్టమర్లు పొందవచ్చు.
    Published by: Krishna Adithya
    First published: October 19, 2020, 9:58 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading