FIXED DEPOSIT INTEREST RATES COMPARED FD RATES TERM DEPOSITS SBI VS HDFC BANK VS ICICI BANK ABOVE 2 CRORE GH VB
Interest Rates: ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంకులు.. తాజా వడ్డీ రేట్లు ఇవే.. తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 2 కోట్లకు మించిన బల్క్ టర్మ్/ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను 0.1 శాతం మేర పెంచింది. కానీ రూ.2 కోట్లలోపు ఎఫ్డీ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
భారతీయులు డబ్బు ఆదా చేసుకోవడంలో ముందుంటారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే మార్కెట్లో అనేక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నప్పటికీ.. ఫిక్స్ డిపాజిట్ల వైపే ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. ఎందుకంటే ఎఫ్డీలు ఎటువంటి రిస్క్ లేకుండా.. స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. అటు బ్యాంకులు కూడా పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి.
తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 2 కోట్లకు మించిన బల్క్ టర్మ్/ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను 0.1 శాతం మేర పెంచింది. కానీ రూ.2 కోట్లలోపు ఎఫ్డీ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు కూడా బల్క్ డిపాజిట్ రేట్లను సవరించాయి. ఈ మూడు ప్రధాన బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై అందిస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిద్దాం.
ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి ఆరు నెలల వరకు 3%, ఆరు నెలల నుంచి పది సంవత్సరాల వరకు గల ఎఫ్డీ డిపాజిట్లపై 3.1% వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.5% వడ్డీ ఆఫర్ చేస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 29 రోజుల వరకు 2.50 %, 30 రోజుల నుంచి 60 రోజుల వరకు 2.75 %, 61 రోజుల నుంచి ఆరు నెలల వరకు 3.00 %, ఆరు నెలల నుంచి 9 నెలల వరకు 3.50 %, తొమ్మిది నెలల నుంచి ఏడాది వరకు 3.65 %, ఏడాది నుంచి రెండేళ్ల వరకు 3.75%, రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు 4.40 % వడ్డీ ఆఫర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.5 % వడ్డీ రేటు పొందవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు..
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ కూడా బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది. 7 రోజుల నుంచి 29 రోజుల వరకు 2.50 %, 30 రోజుల నుంచి 60 రోజుల వరకు 2.75 %, 61 రోజుల నుంచి 90 రోజుల వరకు 3.00 %, 91 రోజుల నుంచి 184 రోజుల వరకు 3.25 %, 185 రోజుల నుంచి 270 రోజుల వరకు 3.50 %, 271 రోజుల నుంచి ఏడాది వరకు 3.65 %, ఏడాది నుంచి 15 నెలల వరకు 4.00%, 15 నెలల నుంచి 18 నెలల వరకు 4.10%, 18 నెలల నుంచి రెండేళ్ల వరకు 4.25 %, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 4.50%, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు 4.60% వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. అయితే, సీనియర్ సిటిజన్లకు కూడా ఇవే వడ్డీ రేట్లు అమలు చేస్తుండటం గమనార్హం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.