హోమ్ /వార్తలు /బిజినెస్ /

Deposits: కస్టమర్లకు బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. పండుగ ముంగిట భారీ శుభవార్త!

Deposits: కస్టమర్లకు బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. పండుగ ముంగిట భారీ శుభవార్త!

Deposits: కస్టమర్లకు బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. పండుగ ముంగిట భారీ శుభవార్త!

Deposits: కస్టమర్లకు బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. పండుగ ముంగిట భారీ శుభవార్త!

Bank News | ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ తీపికబురు అందించింది. డిపాజిట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

FD Rates | బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేసే వారికి తీపికబురు. తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) రేట్లు పెంచుతున్నట్ల ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. రూ. 2 కోట్లకు లోపు ఎఫ్‌డీలకు వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మరో తీపికబురు కూడా అందించింది. బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు పెంచేసింది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కూడా వడ్డీ రేటు పైకి చేరింది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్.. రూ.70,000 తగ్గింపు పొందండిలా!

కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా చివరిగా గత ఏడాది నవంబర్ నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచేసింది. కాగా బ్యాంక్‌లో కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని భావించే వారికి మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుంది. అలాగే ఎఫ్‌డీ రెన్యూవల్‌కు కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అందువల్ల మీరు బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి లేదంటే ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఎలక్ట్రిక్ కారు, స్కూటర్, బైక్ కొనే వారికి కేంద్రం అదిరే ఆఫర్.. అకౌంట్లలోకి రూ.1.5 లక్షలు!

బ్యాంక్ ఆప్ బరోడా ప్రస్తుతం రేట్ల పెంపు తర్వాత మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం వరకు వడ్డీని అందుబాటులో ఉంచింది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.15 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 6.5 శాతంగానే ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.

బరోడా ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. అలాగే బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై అయితే 6.75 శాతం వరకు వడ్డీ ఉంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 7.4 శాతం వడ్డీ వస్తుంది. అదే ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై అయితే 6.75 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 7.75 శాతం వరకు వడ్డీ ఉంది.

First published:

Tags: Bank news, Bank of Baroda, FD rates, Fixed deposits, Money

ఉత్తమ కథలు