మనం పెట్టుబడులు ఎందుకు పెడతాం..? మంచి రిటర్న్ పొందాలనే కదా. మరి యులిప్ (ULIP) పెట్టుబడులతో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నప్పుడు యులీప్ లంటే భయమెందుకు..? యులిప్ అంటే యూనిట్ అనుసంధానిత బీమా ప్లాను. వీటిపై మీకు ఆసక్తి ఉంటే యులిప్ లతో ఒనగూరే ప్రయోజనాలు తెలుసుకుని, పెట్టుబడులు పెట్టండి. కేవలం బీమా (insurance) ప్రయోజనాలు కల్పించడమే కాదు ఆర్థిక మార్కెట్లైన స్టాక్స్, బాండ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన అస్త్రం. ఆకర్షణీయమైన పెట్టుబడులకు వేదికగా యులిప్ లు ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తాయి. యులిప్ పెట్టుబడులతో ట్యాక్స్ సదుపాయాలు కూడా వస్తాయి. వీటికి 5 ఏళ్ల కాలపరిమితితో కూడిన లాకింగ్ పీరియడ్ (lock in period) ఉంటుంది. దీంతో మీ పెట్టుబడికి మంచి లాభాలు వచ్చే అవకాశముంది.
యులీప్ పెట్టుబడుల్లో ఎన్నో ఫ్లెక్సిబిలిటీలు (flexibility) ఉన్నాయి. ప్రీమియం పేమెంట్ మొదలు ఫండ్ సెలెక్షన్ వరకు బోలెడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీవద్ద ఎక్కువ నగదు ఉంటే వెంటనే సింగిల్ ప్రీమియం యులిప్ (single premium ULIP) లో పెట్టుబడులు పెట్టచ్చు. కానీ కొంత కాలం వరకు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ప్రీమియంల రూపంలో చెల్లించే సదుపాయం ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం యులిప్స్ అయితే నెలవారీగా లేదా ఏటా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఇందులో
టాప్ అప్ ఆప్షన్స్ (top up options)కూడా ఉన్నాయి. మీకు జీతంతో పాటు బోనస్ వచ్చిందనుకోండి.. ఆ డబ్బును ఇందులో టాప్ అప్ రూపంలో పెట్టవచ్చు. ఇది మీరు రెగ్యులర్ గా కట్టే ప్రీమియంకు అదనం అన్నమాట. దీంతో పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికల్లా మీరు పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ సమకూర్చుకోవచ్చు.
స్ట్రాటెజీలున్నాయి..
ఈక్విటీ, బ్యాలెన్స్డ్, డెట్ ఫండ్ ఆప్షన్స్ (debt fund option) ను మీరు రిస్క్ తీసుకునే స్థాయిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు రిటర్న్స్ ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీరు పెట్టుబడులు మేనేజ్ చేసుకునే వెసులుబాటును యులీప్ కల్పిస్తుంది. కొన్ని యులీప్ లు మీ వయసు, లక్ష్యాల ఆధారంగా ఇన్సూరర్ స్వయంగా మీ పెట్టుబడులను మేనేజ్ చేసే సరికొత్త యులీప్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటెజీలు (investment strategy) కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చాయి.
పెట్టుబడి-బీమా..
పెట్టుబడి, బీమా రెండు సదుపాయాలూ ఒకే పాలసీలో కల్పించే ఏకైక పెట్టుబడులు యులిప్ లు. అంటే మీరు ఈ ప్లాన్ ను ఎంచుకున్నట్టైతే మళ్లీ బీమా పాలసీవంక చూడాల్సిన అవసరం లేదన్నమాట. పాలసీ కొన్నప్పుడే సమ్ అష్యూర్డ్ ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే మీ తరువాత మీ నామినీకి సమ్ అష్యూర్డ్ అనే కచ్ఛితమైన మొత్తం అందుతుంది. ఎక్సైడ్ లైఫ్ వెల్త్ మాగ్జిమా (Exide life wealth maxima) వంటి కొన్ని యులీపుల్లో పాలసీ హోల్డర్స్ ఈ సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పెంచుకునే అవకాశాలున్నాయి. దీంతో పాలసీ హోల్డర్ కు ప్రొటెక్షన్ కవర్ (protection cover) పెరిగి, ఆర్థిక అవసరాలు తీరుతాయి.
స్మార్ట్ పెన్షన్ ప్లాన్...
ఓ పద్ధతి ప్రకారం పొదుపు చేసుకునేందుకు, ఆర్థిక క్రమశిక్షణ కోసం యులిప్ లు అత్యుత్తమ ఎంపిక. దీర్ఘకాలిక లక్ష్యాలైన సొంత ఇల్లు కట్టుకోవడం, రిటైర్ మెంట్, పిల్లల చదువు, పెళ్లిళ్లు వంటి వాటిని సులువుగా చేరుకునేందుకు సాయం చేసేవిగా యులిప్ పథకాలు పాపులర్ అయ్యాయి. ఇటీవలే లాంచ్ అయిన ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ (Exide life smart pension plan) కూడా యులీప్ ఆధారిత ప్రొడక్ట్. ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంపిక చేసుకుంటే మీరు ఇప్పటి నుంచి చేసే పెట్టుబడులు రిటైర్ మెంట్ కార్పస్ ఫండ్ గా పెద్ద మొత్తం వృద్ధాప్యంలో మీ చేతికి వస్తుంది.
యులీపులతో చక్ర వడ్డీ వస్తుంది, అత్యధిక రిటర్న్స్ రావడానికి కారణం మీరు రెగ్యులర్ గా ఇందులో పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలం వేచి చూడటమే అనే రహస్యాన్ని అర్థం చేసుకుంటే ఆర్థికంగా మీరు సురక్షితమైన జీవితం గడపచ్చు. ఫిక్డ్స్ డిపాజిట్లపై తరచూ వడ్డీ తగ్గిస్తుంటారు కనుక యులీప్ లు మంచి లాభార్జనకు మీకు కలిసివస్తాయి. కానీ పాలసీ గడువు తీరేముందు ప్రీమియంల చెల్లింపులు నిలిపేస్తే చేతికందే మొత్తంపై దాని ప్రభావం ఉంటుంది.
పన్ను మినహాయింపు..
యులిప్ పాలసీ కోసం మీరు చెల్లించే ప్రీమియంలపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు (tax exemption) లభిస్తుంది. మిగతా బీమా పాలసీలకు లభించే వెసులుబాట్లు దీనికి కూడా వర్తిస్తాయి. దీంతోపాటు మెచ్యూరిటీ సమయంలో చేతికందే మొత్తంపై సెక్షన్ 10(10D) కింద పన్ను మినహాయింపు కూడా వస్తుంది. పాలసీపై వర్తించే షరతులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ ఫండ్స్ పై పన్ను మినహాయింపులు వర్తించేలా యులీప్స్ ఉన్నాయి.
ఉపసంహరణ ఈజీ..
మీరు యులిప్ ల రూపంలో పెట్టిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని మాత్రం ఉపసంహరించుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు ఇలా ఉపసంహరించుకునే అవకాశం ఉంది కనుక రుణాలు తీసుకునే అవసరం మీకుండదు. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిందో మీరు ఇలా కొంత మొత్తాలను ఉపసంహరించుకుంటే మీ అవసరాలకు ఆదుకుంటుంది. అత్యవసరాలు లేదా అనుకోకుండా వచ్చిన ఖర్చులను మీరు వీటి ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు.
అత్యుత్తమ పొదుపు...
ఇలాంటి విభిన్నమైన ఫీచర్లు ఉన్నందున యులీప్ స్కీములు అత్యంత ఆకర్షణీయమైన ఆర్థిక పథకాలుగా మార్కెట్లో ఊరడిస్తున్నాయి. మీ డబ్బును ఇవి మార్కెట్లో పెట్టుబడులుగా పెడతాయి కనుక ఈ ప్రాడక్ట్ పనితీరును సంపూర్ణంగా అర్థంచేసుకోవడం చాలా అవసరం. లో కాస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ లో యులీప్ అత్యుత్తమం.