మ్యూచువల్ ఫండ్స్‌ తీసుకునేముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి...

థిమాటిక్ ఫండ్స్‌లో పెట్టుబడులన్నీ అన్నీ ఒక థీమ్‌తో  ఉంటాయి. అంటే తమ పెట్టుబడుల్ని ఒక రంగానికి మాత్రమే పరిమితం చేస్తాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా ఇలా తమ పెట్టుబడుల్ని ఒక రంగానికి మాత్రమే పరిమితం చేస్తాయి. వీటిని సెక్టోరల్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు ఆ రంగం గురించి మీకు పూర్తి అవగాహన ఉండటం మంచిది.

news18-telugu
Updated: January 4, 2019, 5:33 PM IST
మ్యూచువల్ ఫండ్స్‌ తీసుకునేముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మ్యూచువల్ ఫండ్స్... ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇష్టంలేని వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే సరైన మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకోవడం అంత సులువుకాదు. అసలు ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో తెలిస్తేనే మీకు కావాల్సిన ఫండ్ ఎంచుకోవచ్చు. ఆ విషయాలు తెలుసుకోండి.

1. లార్జ్ క్యాప్ ఫండ్స్: లార్జ్ క్యాప్ ఫండ్స్‌ని తక్కువ రిస్క్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువగా బ్లూ-చిప్ కంపెనీలు అంటే భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నవే లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఉంటాయి. మిగతా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ కన్నా తక్కువ రిటర్న్స్ ఉన్నా రిస్క్ తక్కువ. దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు ఎక్కువగా వస్తాయి. ఎవరి పోర్ట్‌ఫోలియోలో అయినా ఇది కీలకమైన ఫండ్.

2. మల్టీ క్యాప్ ఫండ్స్: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ కలయికే మల్టీ క్యాప్ ఫండ్. ఇందులో మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేదు. మార్కెట్ కదలికల్ని బట్టి ఫండ్ మేనేజర్ తన పెట్టుబడుల్ని ఇతర షేర్లపైకి మళ్లిస్తుంటారు. భిన్నమైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ ఫండ్ తీసుకోవచ్చు. మల్టీ క్యాప్ ఫండ్ ఒకటి తీసుకుంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్టే.

3. మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్స్: ఈ ఫండ్స్‌లో అస్థిరత ఎక్కువ. రిటర్న్స్ కూడా ఎక్కువే. ఇందులో పెట్టుబడి పెట్టి కొన్నేళ్లపాటు ఎదురుచూస్తే మంచి లాభాలొస్తాయి. ఇవి చాలా రిస్కుతో కూడుకున్న ఫండ్స్. పెట్టుబడులన్నీ చిన్న కంపెనీలు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంపెనీల్లో ఉంటాయి. తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నా భవిష్యత్తులో వృద్ధి కనిపిస్తుంది. కంపెనీలు సరిగ్గా నడవకపోతే నష్టాలొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

4. ట్యాక్స్ సేవింగ్ ఫండ్: ఈ ఫండ్‌ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ఫండ్(ఈఎల్ఎస్ఎస్) అని కూడా అంటారు. ఇందులో కనీసం మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ లాక్ ఇన్ పీరియడ్‌లో ఫండ్ మేనేజర్ పెట్టుబడుల్ని ఎలాగైనా మార్చుకునే వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సంపద సృష్టి లాంటి దీర్ఘకాల లక్ష్యాలతో పెట్టుబడులు పెట్టేవారికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉపయోగపడ్తాయి. పన్ను మినహాయింపులూ పొందొచ్చు.

5. థిమాటిక్ ఫండ్స్: ఈ ఫండ్స్‌లో పెట్టుబడులన్నీ అన్నీ ఒక థీమ్‌తో  ఉంటాయి. అంటే తమ పెట్టుబడుల్ని ఒక రంగానికి మాత్రమే పరిమితం చేస్తాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా ఇలా తమ పెట్టుబడుల్ని ఒక రంగానికి మాత్రమే పరిమితం చేస్తాయి. వీటిని సెక్టోరల్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు ఆ రంగం గురించి మీకు పూర్తి అవగాహన ఉండటం మంచిది.
ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్

వేతనజీవులు 2018-19లో ఎంత పన్ను ఆదా చేయొచ్చో తెలుసా?

స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్
First published: January 4, 2019, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading