• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • FIRSTRAND BECAME THE SECOND GLOBAL BANK TO EXIT INDIA JUST WITHIN A WEEK OF CITIGROUP DECISION NS

FirstRand: భారత్ కు ఆ బ్యాంకు గుడ్ బై.. కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు సీఈఓ సంచలన ప్రకటన.. వివరాలివే

FirstRand: భారత్ కు ఆ బ్యాంకు గుడ్ బై.. కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు సీఈఓ సంచలన ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా దిగ్గజం సిటీబ్యాంక్ తరువాత దక్షిణాఫ్రికాలో రెండవ అతిపెద్ద బ్యాంకు అయిన ఫస్ట్‌రాండ్ బ్యాంక్, భారతదేశంలో తన వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దక్షిణ ఆఫ్రికాలో రెండో అతిపెద్ద బ్యాంకు అయిన ఫస్ట్‌రాండ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 ఏళ్ల ప్రయాణం తర్వాత భారతదేశంలో తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సైతం వారం క్రితం భారతదేశంలోని వ్యాపారాల నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌రాండ్ బ్యాంక్ మొత్తం ఆస్తులు 118 బిలియన్ డాలర్లు. ఫస్ట్ రాండ్ ఇండియా సీఈఓ రోహిత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశంలోని తమ ఏకైక ముంబాయి బ్రాంచిని మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూసివేత దాదాపు 50 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ప్రస్తుత శాఖ ను ప్రతినిధి కార్యాలయంగా మార్చనున్నారు. ఈ బ్యాంకు 2009తో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
    India Post: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలు భారీగా తగ్గింపు.. వివరాలివే
    Bank Loans: కొత్తగా బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. వివరాలివే

    రిటైల్ కస్టమర్లకు మరియు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు 2012 నుంచి రుణాలు ఇవ్వడాన్ని బ్యాంకు ప్రారంభించింది. కార్యకలాపాలను వేగవంతం చేయడానికి మరియు మరిన్ని శాఖలను తెరవడానికి మరియు చివరికి పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి బ్యాంకు ప్రణాళికలు రూపొందించింది. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే..  దిగ్గజ గ్లోబల్ బ్యాంకుల్లో ఒకటైన సిటీ బ్యాంక్ సైతం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో తమ కార్యకలాపాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.
    LPG Gas Cylinder: కేవలం రూ. 61కే గ్యాస్ సిలిండర్.. మరో 9 రోజులే ఛాన్స్.. ఇలా బుక్ చేయండి

    భారత్‌, చైనాతో పాటు మొత్తం 13 దేశాల్లో రిటైల్‌ బ్యాంకింగ్ విభాగం నుంచి తప్పుకుంటున్నట్లు సిటీ గ్రూప్‌ ప్రకటించింది. ఇకపై ఆయా దేశాల్లో కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మాత్రమే కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది బ్యాంకు. రిటైల్‌ బ్యాంకింగ్‌ విషయానికి వస్తే సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌, యూఏఈ మార్కెట్లపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. సీఈఓగా జేన్‌ ఫ్రేసర్‌ ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకున్న తొలి కీలక నిర్ణయం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు