Home Loan: హోమ్ లోన్ తీసుకునేవారికి రూ.3.5 లక్షల బెనిఫిట్స్

ఇళ్ల అమ్మకాలు మందగించడం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ పన్ను మినహాయింపులు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడే అవకాశముంది.

news18-telugu
Updated: February 3, 2020, 2:30 PM IST
Home Loan: హోమ్ లోన్ తీసుకునేవారికి రూ.3.5 లక్షల బెనిఫిట్స్
Home Loan: హోమ్ లోన్ తీసుకునేవారికి రూ.3.5 లక్షల బెనిఫిట్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు హోమ్ లోన్‌కు అప్లై చేశారా? ఇంటి రుణం తీసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షలు పన్ను మినహాయింపు పొందే గడువును 2021 మార్చి వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రూ.2 లక్షల పన్ను మినహాయింపు ఉంది. మరో రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఆ అవకాశం 2020 మార్చి 31 వరకు మాత్రమే ఉంది. ఆ గడువును 2021 మార్చి వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే హోమ్ లోన్ తీసుకునేవారు చెల్లించే వడ్డీలో రూ.3.5 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.45 లక్షల లోపు మొదటిసారి ఇల్లు కొనేవారికి మాత్రమే పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80ఈఈఏ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3.5 లక్షల పన్ను మినహాయింపు పొందాలంటే 2021 మార్చి లోపు ఇల్లు తీసుకోవాలి.

సరసమైన ధరకే హౌజింగ్ ప్రాజెక్టులు బిల్డర్లకు కూడా ట్యాక్స్ హాలిడే పొందే అవకాశాన్ని కూడా మరో ఏడాది పొడిగించింది కేంద్రం. 2016 జూన్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు సెక్షన్ 80-IBA కింద ట్యాక్స్ హాలిడే ప్రకటించింది కేంద్రం. ఈ ఏడాదే గడువు ముగుస్తుండటంతో బిల్డర్లకు మరో ఏడాది ట్యాక్స్ హాలిడే పొడిగించింది. 'హౌజింగ్ ఫర్ ఆల్' లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల అమ్మకాలు మందగించడం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ పన్ను మినహాయింపులు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

EPF: ఎక్కువ జీతం ఉన్నవారికి త్వరలో షాక్



Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు

PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే... త్వరపడండి

 
First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు