హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Lease: కొత్త కార్ల కన్నా...లీజు కార్లపైనే జనం మోజు... అసలు కారణం ఇదే...

Car Lease: కొత్త కార్ల కన్నా...లీజు కార్లపైనే జనం మోజు... అసలు కారణం ఇదే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆటోమొబైల్ విభాగంలో సెకండ్ హ్యాండ్ కార్లకు లీజింగ్ డిమాండ్ పెరిగిందని తాజా సర్వేలో తేలింది. సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుదారుల్లో 80 శాతం మంది మగవాళ్లు, 20 శాతం మహిళలు ఉంటున్నారని సర్వే వెల్లడించింది.

కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న రంగాల్లో ఆటోమొబైల్ ఇండస్ర్టీ ఒకటి. ప్రజలకు తగ్గిన ఆదాయాలు, తక్కువ డిమాండ్ మధ్య కొత్త వాహనాలు కొనేవారి సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో చాలామంది వాడిన కార్లను లీజుకు తీసుకుంటున్నారని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఆటోమొబైల్ విభాగంలో సెకండ్ హ్యాండ్ కార్లకు లీజింగ్ డిమాండ్ పెరిగిందని తాజా సర్వేలో తేలింది. సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుదారుల్లో 80 శాతం మంది మగవాళ్లు, 20 శాతం మహిళలు ఉంటున్నారని సర్వే వెల్లడించింది. 24-27 సంవత్సరాల మధ్య వయస్సు గల వినియోగదారులు బడ్జెట్ కార్లను ఇష్టపడుతున్నారు. 30-32 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మిడ్ రేంజ్ సెడాన్లు ఇష్టపడుతున్నారు. 38-40 సంవత్సరాల వయస్సు ఉన్న వారు లగ్జరీ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారని అధ్యయంలో వెల్లడించారు.

కారు లీజు వ్యాపారానికి రెక్కలు...

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెటింగ్లో 40 శాతం మెట్రో నగరాల్లో, 60 శాతం నాన్ మెట్రో నగరాల్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. వాడిన కార్ల లీజింగ్ ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విభాగంపై 90 శాతం మంది మెట్రో నగరాల ప్రజలు, 10 శాతం నాన్-మెట్రో నగరాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సర్వేను 'పమ్ పమ్ పమ్' అనే స్టార్టప్ నిర్వహించింది. ఈ సంస్థ కార్ లీజింగ్ విభాగంలో సర్వే చేస్తోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైతో సహా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని 10,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు.

ఎన్నోకారణాలు

కారు కొన్న మొదటి సంవత్సరంలోనే దాని విలువలో తగ్గుదల నమొదవుతున్నట్టు సర్వే తెలిపింది. సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుదారులలో ఎక్కువ శాతం(55 శాతం) మంది మొదటిసారి కారు కొనేవారే ఉంటున్నారని సర్వేలో తెలిసింది. మిగతా వారిలో 41 శాతం మంది.. కుటుంబంలో ఎక్కువ కార్లు ఉన్నవారు. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే రీప్లేస్మెంట్ బయ్యర్స్ ఉన్నారని సర్వేలో తేలింది. వాడిన కార్లు కొనడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వాటిల్లో తక్కువ ధరకు లభించడం, ఇంటి అవసరాలకు వాడే సెకండ్ కారుగా, డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం కొంతమంది సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే... ఉత్తర భారతదేశంలో అత్యధికంగా 36 శాతం మంది సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారు. పశ్చిమ భారత్లో 27 శాతం, దక్షిణ భారతదేశంలో 26 శాతం, తూర్పు భారత్లో 11 శాతం మంది ఉన్నారు.

వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి

కార్ల కొనుగోలుదారుల మనస్తత్వం మారుతున్నట్టు 'పమ్ పమ్ పమ్' సంస్థ సహ వ్యవస్థాపకుడు సమీర్ కల్రా చెబుతున్నారు. "24 నెలల కోసం కారును కొనడం, దానికి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చుతో పోలిస్తే.. 24 నెలలకు లీజుకు తీసుకున్న కారు చాలా తక్కువ ధరకు వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. డీలర్లపై నమ్మకం లేకపోవడం, ఉపయోగించిన కారుపై తక్కువ ఫైనాన్సింగ్, వాటి రిపేరింగ్కు అయ్యే ఖర్చు, ఎక్కువ ధరలు, థర్డ హ్యాండ్ కార్లకు తక్కువ రీసేల్ వ్యాల్యూ ఉండటం, ఎక్కువ డిప్రిసియేషన్ వంటివి భారతదేశంలో వాడిన కార్ల లీజింగ్ మార్కెట్ పెరుగుదలకు అడ్డంకులుగా మారుతున్నాయని సమీర్ వివరిస్తున్నారు. వాడిన కార్లను లీజుకు తీసుకునే ధోరణి పెరుగుతున్నట్టు 'పమ్ పమ్ పమ్' సంస్థ సీఈవో పంపంపం తరుణ్ లావాడియా పేర్కొన్నారు.

First published:

Tags: Automobiles, Cars

ఉత్తమ కథలు