హోమ్ /వార్తలు /బిజినెస్ /

First Take 2022: ఆర్ట్ లవర్స్ కోసం అబిర్ ఇండియా చొరవ.. నవంబర్ 12-18 వరకు ఢిల్లీలో ఆర్ట్ ఫెస్టివల్

First Take 2022: ఆర్ట్ లవర్స్ కోసం అబిర్ ఇండియా చొరవ.. నవంబర్ 12-18 వరకు ఢిల్లీలో ఆర్ట్ ఫెస్టివల్

జ్యూరీ సభ్యులు

జ్యూరీ సభ్యులు

కళాభిమానులకు శుభవార్త. అబిర్ ఇండియా చొరవతో.. ఈసారి మళ్లీ నవంబర్ 12 నుండి 18 వరకు ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో వార్షిక ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Delhi

కళాభిమానులకు శుభవార్త. అబిర్ ఇండియా చొరవతో.. ఈసారి మళ్లీ నవంబర్ 12 నుండి 18 వరకు ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో వార్షిక ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫస్ట్ టెక్ 2022 పేరుతో ఈ ఈవెంట్‌ని ఆరోసారి నిర్వహిస్తున్నారు. అబిర్ ఇండియా ఇప్పటివరకు 390 నగరాల నుండి ఈ ప్రోగ్రామ్ కోసం మొత్తం 2200 కళలను అందుకుంది. ఫస్ట్ టెక్ 2022లో ఈసారి 148 మంది యువ కళాకారులకు అవకాశం ఇస్తున్నారు. అత్యంత పారద్శకమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో సెలెక్టర్లు ఈ ఆర్ట్ లను ఎంపిక చేశారు.

Art work : Deterioration-2 Artist : Anshu Kumari – Tatanagar - Jharkhand

Art Work : Infinity Symbol-2 Artist : Jyotiprakash Sethy - Delhi

Art Work : Reassurance Artist : Shrparna Dutta – Kolkatta

Art Work : Uljhan Artist : Bikashchandra Senapati – Kendrapada – Odisha

Art work : Untitled – AD Artist : Adarsh Palandi – Damoh – Madhya Pradesh

జ్యూరీ ఎవరంటే?

ఈ షోకు జ్యూరీగా జయరామ్ పొదువాల్, మంజునాథ్ కామత్, మనీషా పరేఖ్, జీ.ఆర్.ఇరానా. రూబీ జాగ్రుత్, వీ రమేశ్ వ్యవహరించారు.

Ruby Jagrut, Founder - Abir India

అబిర్ ఇండియా గురించి..

అబిర్ ఇండియా అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఈ సంస్థకు రూబీ జాగృత్ పునాది వేశారు. 2016లో అహ్మదాబాద్‌లో దీని ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం భారతదేశం అంతటా కళాకారుల కోసం ఈ సంస్థ పని చేస్తోంది. గతంలో ఈ ఆర్ట్ షోను ఢిల్లీలో నిర్వహించగా.. ప్రస్తుతం దీని వేదిక ఢిల్లీకి మారింది. వర్ధమాన కళాకారులు ఈ సంస్థ నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఎంపిక చేసిన కళాకారులలో బెస్ట్ 10 మందికి వారి ప్రతిభ, ఆలోచన, భావవ్యక్తీకరణకు అవార్డులు అందించనున్నారు.

First published:

ఉత్తమ కథలు