Norton bikes: భారత్​లో ప్రారంభం కానున్న నార్టన్​ మోటార్స్​.. సెప్టెంబర్ చివరి నాటికి తొలి బైక్​ విడుదల

ప్రతీకాత్మక చిత్రం

టీవీఎస్ మోటార్స్​ గతేడాది బ్రిటీష్​ మెటార్​సైకిల్ బ్రాండ్​ నార్టన్​ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మొట్టమొదటి బైక్​ను లాంఛ్​ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

  • Share this:
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్​ గతేడాది బ్రిటీష్​ మెటార్​సైకిల్ బ్రాండ్​ నార్టన్​ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మొట్టమొదటి బైక్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూకేలోని కోవెంట్రీకి సమీపంలోని సోలిహులలో మోటార్​ సైకిళ్ల ఉత్పత్తిని ప్రారంభించింది. దీంతో సెప్టెంబర్​ చివరి నాటికి మొదటి బైక్​ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాంట్​ ద్వారా ప్రతి సంవత్సరం 8,000 హై-ఎండ్ ప్రీమియం బైక్​లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రంలో మొదటిసారిగా నార్టన్ వి 4 ఎస్ఎస్ మోడల్​ను ఉత్పత్తి చేయనుంది. ఇది 1,200 సిసి ఇంజిన్​తో వస్తుంది. 200 బిహెచ్‌పి టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.
Ampere E-Scooters: బంపర్ ఆఫర్.. రూ. 48 వేలకే ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎక్కడంటే...
Ola e-Scooter: ఓలా ఇ-స్కూటర్ ఎలా ఉంటుందో చూశారా? ప్రత్యేకతలు ఇవే

టీవీఎస్​ మోటార్స్​తో భాగస్వామ్యం..
నార్టన్ సంస్థ ప్రపంచంలోని పురాతన సంస్థ. ఇది 123 సంవత్సరాల క్రితం ప్రారంభమైది. అప్పటి నుంచి ప్రముఖ మోటార్ సైకిల్ బ్రాండ్​గా కొనసాగుతోంది. అన్ని కాలాల్లోనూ అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రిటిష్ మోటార్ సైకిల్​ బ్రాండ్​గా నిలిచింది. ఇంతటి గొప్ప చరిత్ర గల ఈ కంపెనీని GBP 16 మిలియన్లు వెచ్చించి టివిఎస్ సంస్థ 2020 ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో నార్టన్ కొత్త బ్రాండ్ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. అంతేకాదు, దీని సప్లై చైన్​ నెట్‌వర్క్, ప్రోడక్ట్​ రెడీనెస్​, ప్రోడక్ట్ ప్లానింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీపై దృష్టి సారించింది. 2021–22 మొదటి అర్ధ భాగంలో వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయని టివిఎస్ మోటార్ కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.

ఇటీవలి కాలంలో భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు విదేశీ సంస్థలను కొనుగోలు చేస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటోకార్ప్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రూయిజర్ బైక్ బ్రాండ్ హార్లే-డేవిడ్సన్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బజాజ్ ఆటో సంస్థ ఆస్ట్రియాకు చెందిన KTM, యూకేకు చెందిన ట్రయంఫ్ మోటార్‌సైకిళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక, టివిఎస్‌ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మోటార్స్​తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది. కంపెనీ ఇప్పటి వరకు 83,592 యూనిట్ల బిఎమ్‌డబ్ల్యూ 310 సిసి మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసింది.
Published by:Nikhil Kumar S
First published: