Home /News /business /

FIRST ELECTRIC TRACTOR IN INDIA IS MANUFACTURED BY A STARTUP COMPANY IN HYDERABD BK PRV

E tractor: దేశంలో మొట్ట‌మొద‌టి ఈ-ట్రాక్ట‌ర్ మ‌న హైద‌రాబాద్​లో.. పూర్తి వివరాలివే..

E TRACTOR HYD

E TRACTOR HYD

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు ఎల‌క్ట్రిక్ కార్లు, బైక్ లు అండ్ సైకిల్స్ చూశాం. కానీ ఎల‌క్ట్రిక్ ట్రాక్ట‌ర్ మ‌నం చూశామా? అయితే హైదరాబాద్ కు చెందిన స్టార్ట‌ప్ సెలెస్టియల్ ఇ-మొబిలిటీ దేశంలో మొట్ట‌మొద‌టి ఎల‌క్ట్రిక్ ట్రాక్ట‌ర్లు త‌యారు చేస్తోంది.

ఇంకా చదవండి ...
    ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు ఎల‌క్ట్రిక్ కార్లు (Electric cars), బైక్ లు , సైకిల్స్ చూశాం. కానీ ఎల‌క్ట్రిక్ ట్రాక్ట‌ర్ మ‌నం చూశామా? అయితే హైదరాబాద్ (Hyderabad) కు చెందిన స్టార్ట‌ప్ సెలెస్టియల్ ఇ-మొబిలిటీ (Celestial e-mobility) దేశంలో మొట్ట‌మొద‌టి ఎల‌క్ట్రిక్ ట్రాక్ట‌ర్లు త‌యారు చేస్తోంది. అయితే ఈ ట్రాక్ట‌ర్స్ (E tractors) ను ఇతర వాణిజ్య అవ‌స‌రాల‌కు కాకుండా వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు (Agricultural purpose) ఈ త‌యారు చేయ‌డం విశేషం. హైద‌రాబాద్ కు చెందిన సిద్ధార్థ్ దురైరాజన్ అండ్ సయ్యద్ ముబాషీర్ ఈ వినూత్న ఐడియాతో  ముందుకొచ్చారు. స్టార్ట‌ప్ (Startup) ప్రారంభించి అతి కొద్ది రోజుల్లోనే ఈ స్టార్టప్ సెలెస్టియల్ ఇ-మొబిలిటీ (Celestial e-mobility), ప్రీ-సిరీస్ A ఫండింగ్ రౌండ్‌లో $35 మిలియన్ల విలువతో $500,000 ఫండ్ ను సేకరించింది. ప్ర‌స్తుతం వీరు రూపొందించిన ఈ ట్రాక్ట‌ర్ల‌ అగ్రి, ఎయిర్‌పోర్ట్ జీఎస్‌ఈ అండ్ గూడ్స్ క్యారియర్ రంగాల అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి అనువుగా ఉంటుంది అంటున్నారు సంస్థ ప్ర‌తినిధులు, ఇప్ప‌టికే వీళ్ల ఐడియా న‌చ్చి మెక్సికన్ కంపెనీ గ్రూపో మార్వెల్సా (Grupo Marvelsa) ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అంగీక‌రించింది.

    2020లో ఈ- ట్రాక్ట‌ర్స్ ఆవిష్కరణ ..

    30 ఏళ్ల అనుభ‌వం ఉన్న  మెక్సికన్ కంపెనీ గ్రూపో మార్వెల్సా  భాగస్వామ్యంతో 2,500 డీలర్‌షిప్ నెట్‌వర్క్, 800 సర్వీస్ సెంటర్లు అండ్ 35 వెహికల్ యూనిట్ల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్ర‌తినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. సెల్స్టియల్ ఇ-మొబిలిటీ, మార్చి 2020లో ఈ- ట్రాక్ట‌ర్స్ ని ఆవిష్కరించింది, ఆపరేట్ చేయడానికి చాలా సులువుగా ఉండే, చాలా తక్కువ నిర్వహణ ఖర్చులను కలిగి ఉండే అధునాతన ఫీచర్‌లతో ఈ ట్రాక్ట‌ర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ‌. అన్నింటికంటే మించి, అత్యాధునిక బ్యాటరీ సాంకేతికత, వినూత్నమైన స్మార్ట్-ఫంక్షనాలిటీ మరియు బలమైన ఇంజనీరింగ్ వ్య‌వ‌స్థ ఈ ట్రాక్ట‌ర్ సొంతం అంటున్నారు సంస్థ ప్ర‌తినిధులు. వీరు రూపొందించిన ట్రాక్ట‌ర్ PTO, హైడ్రాలిక్స్, 4-వీల్ డ్రైవ్ మరియు డీజిల్ ట్రాక్టర్‌లతో పోల్చదగిన ఇతర అన్ని సౌక‌ర్య‌లు కలిగి ఉంది.



    ఉత్తర అమెరికా మార్కెట్‌లలోకి..

    ‘‘మేం వచ్చే 3 సంవత్సరాలలో మెక్సికన్ మార్కెట్లో 4,000 ఇ-ట్రాక్టర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మెక్సికో మార్కెట్‌లో లాభదాయకంగా ఉంటుంద‌ని అనుకుంటున్నాం. దీంతొపాటు ఉత్తర అమెరికా మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి ఈ పెట్టుబడులు చాలా ఊప‌యోగ‌ప‌డుతుంద‌ని ” సిద్ధార్థ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు న్యూస్ 18కి తెలిపారు. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, USD $ 5.56 బిలియన్ విలువైన మురుగప్ప కంపెనీ, 21.5 మిలియన్ USD పెట్టుబడికి సెలెస్టియల్ E-మొబిలిటీలో 70% నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. త్వ‌ర‌లో ఇండియాన్ మార్కెట్లో కూడా ఈ ట్రాక్ట‌ర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు సంస్థ ప్ర‌తినిధులు.

    బ్యాటరీ స్వాప్, రీజెనరేటివ్ బ్రేకింగ్, పవర్ ఇన్‌వర్షన్, రెసిడెన్షియల్ AC పవర్ ఛార్జింగ్ మరియు సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో దేశంలోనే మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రోటోటైప్‌ను మార్చి 2020లో ఆవిష్కరించినట్లు సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్ర‌తినిధులు సన్నాహాలు చేస్తున్నారు .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Electric Vehicles, Hyderabad, Tractors

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు