టూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) మార్చి 18న ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ టూరిస్ట్ రైలును ఆపరేట్ చేస్తోంది. పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కవర్ అవుతాయి. మార్చి 18న సికింద్రాబాద్‌లో బయల్దేరే టూరిస్ట్ రైలు తిరిగి మార్చి 26 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సింహాచలం, విజయనగరం రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన విశేషాలను ప్రెస్ మీట్‌లో వివరించారు. ఈ టూరిస్ట్ రైలులో 700 బెర్తులు ఉన్నాయి. వీటిలో స్లీపర్ బెర్తులు 460, థర్డ్ ఏసీ బెర్తులు 192, సెకండ్ ఏసీ బెర్తులు 48 ఉన్నాయి. మార్చి 18న బయల్దేరే రైలులో బెర్త్‌లన్నీ బుక్ అయిపోయాయి. వీరిలో 468 మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌లో టూరిస్ట్ రైలు ఎక్కనుండగా, మిగతావారంతా ఇతర రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కుతారు. ఏప్రిల్ 18న మరోసారి ఈ టూరిస్ట్ రైలు అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
SBI Charges: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలు
A Press Meet was organised by GM/SCR in the presence of senior officials of SCR & IRCTC on 15.03.23 on Bharat Gaurav Tourist Train' departure planned for 18.04.2023 under 'Ganga Pushkarala Yatra' & inaugural trip on 18.03.2023 'Punyakshetra Yatra'. pic.twitter.com/XYuCHM1qI9
— IRCTC (@IRCTCofficial) March 15, 2023
ఐఆర్‌సీటీసీ టూరిజం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. కాజీపేట్, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి , సామర్లకోట, సింహాచలం, విజయనగరంలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మాల్తీ పాత్‌పూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని పూరీ తీసుకెళ్తారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రికి పూరీలో బస చేయాలి. మూడో రోజు పూరీ నుంచి కోణార్క్ తీసుకెళ్తారు. కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మాల్తీ పాత్‌పూర్‌కు తిరిగి తీసుకెళ్తారు. అక్కడ రైలు ఎక్కితే నాలుగో రోజు గయ చేరుకుంటారు. గయలో పిండ ప్రదానం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి వారణాసికి బయల్దేరాలి.
ఐదో రోజు వారణాసి చేరుకుంటారు. సారనాథ్, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశ్వనాథ కారిడార్, అన్నపూర్మ దేవి ఆలయం సందర్శించుకోవాలి. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం వారణాసి నుంచి అయోధ్య బయల్దేరాలి. అయోధ్య చేరుకున్నాక రామ జన్మభూమి, హనుమాన్ గఢి సందర్శన ఉంటుంది. సాయంత్రం సరయు నది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి.
PAN Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో సింపుల్‌గా చెక్ చేయండిలా
ఏడో రోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమాన్ మండపం సందర్శించుకోవచ్చు. ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు స్వస్థలానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ ధరలు చూస్తే భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్‌లో భాగంగా భారతీయ రైల్వే సుమారు 33 శాతం తగ్గింపు అందిస్తోంది. కన్సెషన్ తర్వాతే ప్యాకేజీ ధరలు చూస్తే మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,955 కాగా, సింగిల్ షేర్ ధర రూ.15,300. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.22,510 కాగా, సింగిల్ షేర్ ధర రూ.24,085. ఇక కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,615 కాగా, సింగిల్ షేర్ ధర రూ.31,510. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gaurav Train, IRCTC, IRCTC Tourism, Varanasi