Home /News /business /

FINANCIAL PLANNING TRENDS AMONG GEN Z AND WHY ADDING LIFE INSURANCE IS IMPORTANT GH VB

Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్‌పై జనరేషన్‌ జెడ్ ఆసక్తి.. ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అవసరం అంటున్న యూత్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా తర్వాత జెన్ జెడ్ (Gen Z) వారిలో ఆర్థిక ప్రణాళిక, బీమా ప్రాముఖ్యత గురించి అవగాహన వచ్చింది. అయితే వీరు పెట్టుబడులపై రాబడి.. లాభదాయకమైన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు కానీ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటంపై ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం ?

ఇంకా చదవండి ...
భారత జనాభాలో మిలీనియల్స్ (Millennials), జనరేషన్ జెడ్ (Gen Z) కేటగిరీలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. జనరేషన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన తరం. అయితే ఓ సర్వే ప్రకారం, ఈ జనరేషన్ వ్యక్తులు ఖర్చు పెట్టడం కంటే ఎక్కువగా పొదుపు (Savings) వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జనరేషన్ జెడ్ వారు సేవింగ్స్ పై(Savings) ఆసక్తి కనబరుస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. కరోనా(Corona) తర్వాత జెన్ జెడ్ (Gen Z) వారిలో ఆర్థిక ప్రణాళిక, బీమా ప్రాముఖ్యత గురించి అవగాహన వచ్చింది. అయితే వీరు పెట్టుబడులపై రాబడి.. లాభదాయకమైన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు కానీ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటంపై ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం లేదు. ఫలితంగా జీవిత బీమా (Life Insurance) అనేది వారు అసలు కొనుగోలు చేయని ఒక ప్రొడక్ట్ గా మారిపోయింది. అయితే ఈ తరం ప్రజలు జీవిత బీమా తీసుకోవడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

జనరేషన్ జెడ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోవాలి ?డిపెండెంట్లు లేకుంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కానీ చిన్న వయస్సులోనే పాలసీని కొనుగోలు చేయడం వల్ల ప్రీమియంను తక్కువ ఖర్చుతో లాక్ చేసుకోవచ్చు. తద్వారా కాలక్రమేణా జీవిత బీమాపై మొత్తం ఖర్చు తగ్గుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. మరి సరైన బీమాను ఎంచుకోవడంలో యువత పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రాండ్ పేరుఅత్యుత్తమ బీమా పాలసీని ఎంచుకోవాలంటే ముందుగా మీరు అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ ఉన్న బీమా కంపెనీని కనిపెట్టాలి. ఈ బీమా కంపెనీలో మీరు ఉత్తమ పాలసీని కొనుగోలు చేయవచ్చు.

Explained: న్యూక్లియర్ రియాక్టర్లపై కొత్త పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్.. అందుబాటులో అణుశక్తిపై పూర్తి సమాచారం!


క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిఒక సంవత్సరంలో చేసిన మొత్తం క్లెయిమ్‌లలో బీమా ప్రొవైడర్ సెటిల్ చేసే క్లెయిమ్‌ల మొత్తం శాతాన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని అంటారు. కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95 శాతం కంటే తక్కువ ఉండకూడదు. పాలసీని కొనుగోలు చేసే ముందు ఈ నిష్పత్తిని తప్పనిసరిగా చెక్ చేయాలి. ప్రీమియంపాలసీకి మీరు చెల్లించే ప్రీమియం ఒక్కో కంపెనీకి భిన్నంగా ఉంటుంది. మీరు ఏజెంట్ ద్వారా బీమా తీసుకుంటే, ప్రీమియం మొత్తం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మీరు బీమాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం మంచిది.

హామీ మొత్తంహామీ మొత్తం లేదా సమ్ అష్యూర్డ్ (SA) అనేది పాలసీదారుడికి ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు నామినీ పొందే స్థిర మొత్తం. పాలసీ కొనుగోలుదారు నామినీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి హామీ మొత్తం సరిపోతుందని నిర్ధారించుకోవాలి. బీమా రైడర్లుప్రాథమిక బీమా పాలసీకి యాడ్-ఆన్స్ గా బీమా రైడర్లు ఉంటాయి. పాలసీ కొనుగోలుదారు పాలసీతో పాటు తీవ్ర అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణించిన రైడర్లను జత చేయడం ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎందుకంటే ఈ రైడర్‌లు అదనపు కవరేజీని అందిస్తాయి. అలానే ప్రమాదం నుంచి అదనపు రక్షణను ఆఫర్ చేస్తాయి.
Published by:Veera Babu
First published:

Tags: Business, Life Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు