హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investments: చిన్నప్పటి నుంచే ఆర్థిక పాఠాలు చెప్పాలి.. 18 ఏళ్లకు ఇన్వెస్ట్ చేయాలంటున్న నిపుణులు..

Investments: చిన్నప్పటి నుంచే ఆర్థిక పాఠాలు చెప్పాలి.. 18 ఏళ్లకు ఇన్వెస్ట్ చేయాలంటున్న నిపుణులు..

Investments: చిన్నప్పటి నుంచే ఆర్థిక పాఠాలు చెప్పాలి.. 18 ఏళ్లకు ఇన్వెస్ట్ చేయాలంటున్న నిపుణులు..

Investments: చిన్నప్పటి నుంచే ఆర్థిక పాఠాలు చెప్పాలి.. 18 ఏళ్లకు ఇన్వెస్ట్ చేయాలంటున్న నిపుణులు..

డబ్బు దాచడం గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. లెక్కలు రాయడం, సేవింగ్స్, ఖర్చులపై అవగాహన పెంచుకోవడం వంటివి ఫైనాన్షియల్ లిటరసీ కిందకు వస్తాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

డబ్బు దాచడం గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. లెక్కలు రాయడం, సేవింగ్స్(Savings), ఖర్చులపై అవగాహన పెంచుకోవడం వంటివి ఫైనాన్షియల్ లిటరసీ(Financial Literacy) కిందకు వస్తాయి. అయితే డబ్బుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలనేది అసలైన విషయం అంటున్నారు భారతదేశపు అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ హౌస్ జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్. 18ఏళ్లు నిండినప్పటి నుంచే పెట్టుబడులపై కనీస అవగాహన పెంచుకోవాలని ఆయన ఈ తరం యువతకు సూచిస్తున్నారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా.. 18ఏళ్లు నిండిన వారు దృష్టిపెట్టాల్సిన అంశాలను కొందరు ప్రముఖులు మనీకంట్రోల్ వార్తాసంస్థకు వివరించారు. అవేంటో చూద్దాం.

ప్రతి ఒక్కరూ 18 ఏళ్లు నిండిన తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. పాకెట్ మనీని దాంట్లో సేవ్ చేసుకోవాలి. అయితే డబ్బు దాచుకోవడం మంచిదే అయినప్పటికీ, ఆ డబ్బును బ్యాంక్ ఖాతాలో స్తబ్దుగా ఉంచకుండా, దానితో మరింత డబ్బు సంపాదించే మార్గాలపై దృష్టి పెట్టాలని కామత్ సలహా ఇస్తున్నారు. ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీ డబ్బు అంత వేగంగా సంపదను సృష్టిస్తుందని విశ్లేషిస్తున్నారు. కామత్ 17 సంవత్సరాల వయస్సులోనే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. దీర్ఘకాలంలో సంపదను అందించే ఈక్విటీలను అతడు ఎంచుకున్నాడు.

* ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచాలి

చాలామంది ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి, దాన్ని పట్టించుకోరు. అయితే ఇలా ప్రారంభ పెట్టుబడి పెట్టి వదిలేయకుండా, ప్రతి సంవత్సరం పెట్టుబడిని పెంచుకోవాలని సలహా ఇస్తున్నారు రూపీ విత్ రుషబ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు రుషబ్ దేశాయ్. మీరు 18 సంవత్సరాల వయస్సులో నెలకు రూ. 500 పెట్టుబడి పెట్టి, 30 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కేవలం 10 శాతం పెంచుకుంటే, మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడేంత మొత్తాన్ని మీరు కూడగట్టుకుంటారని దేశాయ్ మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ వివరించారు.

Railway Jobs 2022: ఇంటర్, డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయాలి

పెట్టుబడి పెట్టడం అనేది ఎవరికైనా ఒక అలవాటుగా మారాలని చెబుతున్నారు కామత్. నిర్ధిష్ట వ్యవధిలో మీ డబ్బును క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుందని వివరించారు. ఇందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) ద్వారా రెండు ఫ్లెక్సీ-క్యాప్ లేదా లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ (MF)లో పెట్టుబడి పెట్టాలని, అలాగే మార్కెట్‌కు అలవాటు పడాలని దేశాయ్ సిఫార్సు చేస్తున్నారు. మీ పాకెట్ మనీలో కనీసం 25 శాతాన్ని ఈ రెండు ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే.. భవిష్యత్తులో సంపద వృద్ధి చెందుతుందని చెప్పారు.

అవగాహన ముఖ్యం

అయితే కాస్త ఎదుగుతున్నా కొద్దీ క్రెడిట్ కార్డులు, లోన్లు, వంటి వాటి ఉపయోగాలు, సరిగ్గా ఉపయోగించకపోతే అవి మిగిల్చే నష్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ లిటరసీ బుక్స్ చదివితే ఎంతో కొంత అవగాహన పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు ఎటికా వెల్త్ CEO గజేంద్ర కొఠారి. స్టాక్ మార్కెట్లు, పెట్టుబడుల ప్రాథమికాలను తెలుసుకోవడానికి NSE (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) లేదా BSE (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) అందించే షార్ట్ టర్మ్ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు చేయవచ్చని కొఠారి సూచిస్తున్నారు.

అయితే ఎప్పుడైనా మనకు అర్థమయ్యే ఇన్వెస్ట్‌మెంట్స్ మార్గాల్లోనే పెట్టుబడి పెట్టాలని కామత్ సలహా ఇస్తున్నారు. నష్టాలు వచ్చినా సరే పెద్దగా ఆందోళన చెందకుండా, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెబుతున్నారు. మీ డబ్బును పెంచుకోవడానికి ఓపికగా ఉండటం అవసరం అని కామత్ వివరిస్తున్నారు.

First published:

Tags: Investing, Investment Plans, Stocks

ఉత్తమ కథలు