హోమ్ /వార్తలు /బిజినెస్ /

Diwali Bonus: దీపావళి బోనస్‌ వచ్చిందా ?.. వెంటనే ఖర్చు చేయకండి.. వీటి గురించి ఆలోచించండి

Diwali Bonus: దీపావళి బోనస్‌ వచ్చిందా ?.. వెంటనే ఖర్చు చేయకండి.. వీటి గురించి ఆలోచించండి

Diwali Bonus: దీపావళి బోనస్‌ వచ్చిందా ?.. వెంటనే ఖర్చు చేయకండి.. వీటి గురించి ఆలోచించండి. (ప్రతీకాత్మక చిత్రం)

Diwali Bonus: దీపావళి బోనస్‌ వచ్చిందా ?.. వెంటనే ఖర్చు చేయకండి.. వీటి గురించి ఆలోచించండి. (ప్రతీకాత్మక చిత్రం)

సంవత్సరమంతా కష్టపడిన తర్వాత చేతికందే ఈ స్పెషల్ ఫండ్‌ను చాలా తెలివిగా ఉపయోగించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ బోనస్ అమౌంట్‌ను తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు దీపావళి బోనస్‌(Diwali Bonus)లు చెల్లిస్తున్నాయి. ఈ బోనస్‌లతో కొందరు షాపింగ్‌ చేయడానికి ఇష్టపడితే.. మరికొందరు వివిధ రకాల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే సంవత్సరమంతా కష్టపడిన తర్వాత చేతికందే ఈ స్పెషల్ ఫండ్‌ను చాలా తెలివిగా ఉపయోగించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ బోనస్ అమౌంట్‌ను తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలో చూద్దాం.

* లోన్ ప్రీ-పేమెంట్

బోనస్‌తో లోన్లను ప్రీ-పేమెంట్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయి. పర్సనల్ లోన్ కోసం ప్రీ-పేమెంట్ చేస్తే వడ్డీ ఆదా చేస్తుంది. ఒక పర్సనల్ లోన్ మాత్రమే కాదు లోన్ ఏదైనా సరే ప్రీ-పేమెంట్ చేయడం వల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తం లోన్‌ను ఒకేసారి ప్రీ-పేమెంట్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ కూడా పెరుగుతుంది. లోన్ ప్రీ-క్లోజర్లు మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపవు. వీలైతే ఒకేసారి హోమ్ లోన్ తీర్చుకుంటే చాలా మొత్తంలో కట్టాల్సిన వడ్డీ అనేది ఆదా అవుతుంది. హోమ్ లోన్ తీసుకున్నవారు ఎంత రెగ్యులర్‌గా ప్రీపేమెంట్ చేస్తే అంత తక్కువ వడ్డీ కట్టుకోవచ్చు. అలాగే ప్రీ పేమెంట్ వల్ల తక్కువ సమయంలోనే ఇల్లును పూర్తిగా సొంతం చేసుకోవచ్చు.

* అప్పులు చెల్లించాలి

పెరుగుతున్న రెపో రేట్ల కారణంగా రుణాలపై వడ్డీ రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారమవుతున్న ఈ వడ్డీలను తప్పించుకోవడానికి అన్ని అప్పులను ఎంత త్వరగా తీర్చుకుంటే అంత మంచిది. క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు వంటి అసురక్షిత రుణాలు ఏవైనా ఉంటే, వాటిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నందున వాటిని ముందుగా చెల్లించడం మంచిది. తర్వాత హోమ్ లోన్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా ఎంత మేర తీర్చగలరనేది అంచనా వేసుకోవాలి. గృహ రుణం ముందుగానే చెల్లించడం ద్వారా కట్టే వడ్డీ మొత్తం తగ్గుతుంది. దీపావళి బోనస్‌ను అప్పులు తీర్చడానికి ఉపయోగించడం కంటే తెలివైన నిర్ణయం మరొకటి లేదని నిపుణులు చెబుతున్నారు.

Income Tax Returns: వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఐటీ రిటర్న్స్ గడువు పెంపు.. ఎలాంటి జరిమానా లేకుండానే..

Aadhaar Complaints: మీ ఆధార్‌లో ఏవైనా సమస్యలున్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

* ఎమర్జెన్సీ ఫండ్

అప్పు లేని వారైతే భవిష్యత్తులో ఆకస్మాత్తుగా తలెత్తే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. గత 18 నెలలలో ఆర్థిక కష్టాల మధ్య మీరు మీ ఎమర్జెన్సీ కార్పస్‌లోని డబ్బు తీసి ఉంటే బోనస్‌తో దాన్ని రీఫిల్ చేయడం చాలా ముఖ్యం. మీ వద్ద అత్యవసర నిధి లేకుంటే, కనీసం ఆరు నెలల విలువైన మీ ఖర్చులను కవర్ చేసే కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం బోనస్ ఉపయోగించాలి.

* మరిన్ని ఆప్షన్స్

దీపావళి బోనస్‌ని ఉపయోగించి స్కిల్స్ పెంచుకోవడం లేదా ఏదైనా కొత్తది నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా హెల్ప్ అవుతుంది. దీపావళి బోనస్‌తో జీవిత బీమా లేదా వైద్య బీమాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడంలో మీకు సహాయం చేస్తుంది. బోనస్‌తో లైఫ్‌లో గుర్తుండి పోయేలా ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినా మంచిదే.

First published:

Tags: Diwali 2022, Personal Finance

ఉత్తమ కథలు