Tax deductions for employees: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి బడ్జెట్‌లో ఇవి ఇవ్వాలంటున్న నిపుణులు

Tax deductions for employees: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి బడ్జెట్‌లో ఇవి ఇవ్వాలంటున్న నిపుణులు (ప్రతీకాత్మక చిత్రం)

Union Budget 2021 | వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు ట్యాక్స్ డిడక్షన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.

  • Share this:
కరోనా సంక్షోభం తరువాత ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఖర్చులపై ట్యాక్స్ డిడక్షన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రానున్న బడ్జెట్‌లో దీనిపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పీడబ్ల్యుసీ ఇండియా కన్సల్టింగ్ సంస్థ సీనియర్ టాక్స్ పార్టనర్ రాహుల్ గార్గ్ విశ్లేషించారు. పీడబ్ల్యుసీ ఇండియా నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సెషన్లో ఈ విషయం గురించి మాట్లాడారు. డిమాండ్ క్రియేషన్‌ కోసం వ్యక్తుల చేతుల్లో డబ్బు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగం చేస్తున్న స్మాల్, మీడియం ట్యాక్స్ పేయర్లకు డిడక్షన్స్ ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇలాంటి ఉద్యోగులు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తే, వారి ఖర్చులను సంబంధిత సంస్థలు భరించేవి. వీరు ఇంటినుంచి పనిచేసేటప్పుడు వారికి ట్యాక్స్ డిడక్షన్స్ ఇవ్వడం ద్వారా, ట్యాక్స్ బారం కొంతవరకు తగ్గుతుందని రాహుల్ వివరించారు.

ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే సందర్భంలో యాజమాన్యాలే ఉద్యోగుల ఖర్చులను భరిస్తాయి. ఈ ఖర్చులన్నీ ఆయా సంస్థల డిడక్టబుల్ ఎక్స్‌పెండీచర్ కిందకు వస్తాయి. కానీ గత ఏడాది కరోనా వెలుగు చూసిన తరువాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయమని చెప్పాయి. దీంతో ఉద్యోగుల ఖర్చులను సంస్థలు భరించే అవకాశం పోయింది. ఇప్పుడు ఈ డిడక్టబుల్ ఎక్స్‌పెండీచర్ ఉద్యోగులపై పడుతోంది. దీన్ని ట్యాక్స్ నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఇలాంటి మినహాయింపులు, రాయితీలు ఇవ్వడంవల్ల ఉద్యోగులు కొంతవరకు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. దీంతో ఇది డిమాండ్ క్రియేషన్‌కు ఉపయోగపడుతుందని గార్గ్ తెలిపారు. కొత్త బడ్డెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ట్యాక్స్ అసమానతలను తగ్గించేందుకు కొన్ని సవరణలు చేసే అవకాశం ఉంది.

SBI Mutual Fund: ఎస్‌బీఐ నుంచి కొత్త మ్యూచువల్ ఫండ్... నెలకు రూ.1,000 చాలు

SBI: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో లక్షల మంది చేరుతున్నారు... మీరూ చేరండి ఇలా

కస్టమ్స్ డ్యూటీ పెరగదు


ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీని పెంచే అవకాశాలు లేవని పీడబ్ల్యుసీ ఇండియా ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ ప్రాక్టీసెస్‌ హెడ్ ప్రతీక్ జైన్ చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే అవకాశం కూడా లేదన్నారు. సెల్‌ఫోన్, ఫర్నిచర్ వంటివాటిపై సుంకాలను పెంచే అవకాశాలు ఉన్నాయని జైన్ చెప్పారు. ‘‘గత రెండేళ్లలో డైరెక్ట్ ట్యాక్స్ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘వివాద్ దే విశ్వాస్’ పథకాన్ని రూపొందించింది. ఇంతకు ముందు కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. కస్టమ్స్ కోసం ఇలాంటి పథకాన్ని రూపొందించడానికి, డిస్పూటెడ్ ట్యాక్స్ చెల్లించడానికి ఇండస్ట్రీకి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఇలాంటి పెనాల్టీలను మాఫీ చేస్తే ప్రభుత్వానికి రూ.15,000-20,000 కోట్ల వరకు రావచ్చు’’ అని జైన్ వివరించారు.

LIC Jeevan Umang Plan: రోజూ రూ.199 పొదుపు చేస్తే రూ.94 లక్షలు మీ సొంతం

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... ఈ 9 పాయింట్స్ మర్చిపోవద్దు

కోవిడ్ సెస్ ఉంటుందా?


ఒకవేళ ప్రభుత్వం COVID వ్యాక్సినేషన్ కోసం ఫండ్స్ సేకరించాలనుకుంటే ఈ బడ్జెట్‌లో కోవిడ్ సెస్‌ను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇది కొన్ని ఉత్పత్తులకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. విస్తృతమైన ఉత్పత్తులపై కోవిడ్ సెస్ విధించే అవకాశం ఉంది. ట్యాక్స్ కాంపోనెంట్‌పై కాకుండా బేస్ వ్యాల్యూపై ఈ సెస్ విధించే అవకాశం ఉందని ప్రతీక్ జైన్ తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published: