Finance Ministry: ఇన్సూరెన్స్ కంపెనీల బిజినెస్ అభివృద్ధికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇతర ఫైనాన్షియల్ సర్వీసులు కూడా అందించే అవకాశం కల్పించాలని పేర్కొంది. తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) చట్టంతో పాటు ఇన్సూరెన్స్ యాక్ట్‌కు ఆర్థిక సేవల విభాగం(Department Of Financial Services) కొన్ని ముఖ్యమైన సవరణలు ప్రతిపాదించింది. వీటిపై డిసెంబర్ 15లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ఇన్సూరెన్స్ యాక్ట్ కోసం, కాంపోజిట్ లైసెన్సుల జారీని ఆమోదించాలని ఆర్థిక సేవల విభాగం ప్రపోజ్ చేసింది. ఈ సూచనలకు ఆమోదం లభిస్తే.. వచ్చే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* IRDAI యాక్ట్ అమెండ్మెంట్
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీలోని హోల్ టైమ్ మెంబర్స్ మరింత కాలం కొనసాగాలని ఆర్థిక సేవల విభాగం సూచించింది. ప్రస్తుతం వీరి పదవీకాలం 62 సంవత్సరాలుగా ఉండగా.. 65 సంవత్సరాలకు మారుస్తూ ఐఆర్డీఏఐ యాక్ట్‌లో సవరణలు చేయాలని ప్రపోజ్ చేసింది.
* కాంపోజిట్ లైసెన్స్ అంటే ఏంటి?
కాంపోజిట్ లైసెన్స్ అనేది ఒక కామన్ లైసెన్స్. దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్‌ను లేదా స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్‌ను చేపట్టవచ్చు. అదే విధంగా ఈ రెండింటిలో ఒక దాన్ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. మరోవైపు రెగ్యులేటర్ నుంచి పొందే కాంపోజిట్ లైసెన్స్‌కు సంబంధించినంత వరకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది.
Sabarimala Trains: శబరిమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు ... రూట్స్, టైమింగ్స్ ఇవే
* ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్
ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను కూడా అందజేసేలా ఇన్సూరెన్స్ కంపెనీలను అనుమతించాలని ఆర్థిక సేవల విభాగం సూచించింది. ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ల కిందకు మ్యూచువల్ ఫండ్లు, లోన్లు లేదా ఇతర స్ట్రీమ్‌ల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌లు వంటివి వస్తాయి. అంటే జీవితకాలం జనరల్ ఇన్సూరెన్స్ సేవలు, ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను కంపెనీ అందజేసే అవకాశం కలుగుతుంది. ఈ చర్యలతో ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త బిజినెస్‌లు అందుతాయి. రెవెన్యూ కూడా పెరుగుతుంది. అయితే ఇవి IRDAI ఆమోదించే నిబంధనలకు లోబడి ఉంటాయి.
* వాటా కొనుగోలు
ప్రస్తుతం ఏదైనా సంస్థ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో 5 శాతం వాటాను కలిగి ఉంటే, అది తదుపరి కొనుగోలు కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఆమోదాన్ని పొందాలి. ఐదు శాతం వాటా పొందే వరకు అనుమతి అవసరం లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తమ హోల్డింగ్ కంపెనీకి తమ మొత్తం బిజినెస్‌ను బుక్స్‌పై చూపేందుకు క్యాప్టివ్ రీఇన్స్యూరెన్స్ కంపెనీగా సేవలందించగలుగుతాయి.
* కొత్త ఇన్సూరెన్స్ కంపెనీలకు మినిమం క్యాపిటల్?
ప్రస్తుతం హెల్త్, జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు మినిమం క్యాపిటల్‌గా రూ.100 కోట్లు చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ పరిమాణం, కార్యకలాపాల స్థాయి ఆధారంగా మినిమం క్యాపిటల్‌ను నిర్ణయిస్తారు. ఆ మొత్తం ఎంత ఉండాలనే అంశం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, Insurance