కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కరెన్సీ నోట్ల(Indian Currency) రూపురేఖలు మారిపోయిన విషయం తెలిసిందే. కేంద్రం డిమానిటైజేషన్(Demonetisation) ప్రకటించి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సరికొత్త డిజైన్లతో 2000 నోట్లను విడుదల చేసింది. అనంతరం రూ.500 నుంచి రూ.10 వరకు అన్ని కరెన్సీ నోట్లను కొత్త రూపంతో అందుబాటులోకి తెచ్చింది. అయితే డిమానిటైజేషన్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు భారత కరెన్సీ రూపం మారబోతోంది. ఈసారి నోట్లు కాదు.. కానీ రూ.1, 2, 5, 10, 20 వంటి రూపాయి నాణేలు కొత్త రూపంతో వాడకంలోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువ కలిగిన కొత్త నాణేలను తాజాగా నోటిఫై చేసింది. ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, ఇరవై రూపాయల నియమాలు 2021 పేరుతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిని తీసుకురానుంది. ఈ కాయిన్ నియమాలు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ అధికారిక జారీ ప్రకారం టంకశాల(mint- నాణేల తయారీ ప్రాంతం) వద్ద రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు రూపొందిస్తారు. ఈ కొత్త నాణేల వెనుక భాగంలో చాలా మార్పులు కనిపించాయి. త్వరలోనే జారీ అయ్యే కొత్త నాణేల డిజైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
BOB Mega e-Auction: బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ-వేలం.. తక్కువ ధరకే ఇళ్లు, ఆస్తులు కొనేయండిలా..
1) ఒక రూపాయి:
- ముందుభాగం
కొత్త రూపాయి నాణెం ముందుభాగం (obverse-ఫ్రంట్ ఫేస్)లో "సత్యమేవ జయతే" అనే జాతీయ నినాదంతో భారత జాతీయ చిహ్నమైన "అశోక స్తంభం సింహం క్యాపిటల్(Lion Capitol Of Ashoka Pillar)" ఉంటుంది. ఎడమ అంచున "భారత్" అనే హిందీ పదం.. కుడి అంచున "ఇండియా(INDIA)" అనే ఇంగ్లీష్ పదం ఉంటుంది.
- వెనుకభాగం
నాణెం వెనుకభాగంలోని మధ్యలో “आज़ादी का अमृत महोत्सव-ఆజాది కా అమృత మహోత్సవ్” (Azadi Ka Amrit Mahotsav) అధికారిక లోగో ఇమేజ్ ఉంటుంది. రూపాయి సింబల్ "₹"తో పాటు అంతర్జాతీయ సంఖ్యా విలువ "1" లోగో చిత్రం కింద కనిపిస్తుంది. నాణెం పైభాగంలో ఆంగ్లంలో "75వ స్వాతంత్ర్యం" అని కనిపిస్తుంది. అంతర్జాతీయ అంకెలలో ముద్రించిన సంవత్సరం నాణెం ఎడమ అంచు మధ్యలో కనిపిస్తుంది.
RBI Hackathon: ఈ 4 సమస్యలకు పరిష్కారం చెప్తే రూ.40 లక్షల బహుమతి
2. రెండు రూపాయలు
- ముందుభాగం
కొత్త రూ.5 నాణెం ముందుభాగం (obverse-ఫ్రంట్ ఫేస్)లో "సత్యమేవ జయతే" అనే జాతీయ నినాదంతో భారత జాతీయ చిహ్నమైన "అశోక స్తంభం సింహం క్యాపిటల్" ఉంటుంది. ఎడమ అంచున "భారత్" (భారత్) అనే హిందీ పదం.. కుడి అంచున "ఇండియా" అనే ఇంగ్లీష్ పదం ఉంటుంది.
- వెనుకభాగం
రెండు రూపాయల నాణెం వెనుకభాగంలోని మధ్యలో “ఆజాది కా అమృత మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav-आज़ादी का अमृत महोत्सव)” అధికారిక లోగో ఇమేజ్ ఉంటుంది. రూపాయి సింబల్ "₹"తో పాటు అంతర్జాతీయ సంఖ్యా విలువ "2" లోగో ఇమేజ్ దిగువన కనిపిస్తుంది. నాణెం పైభాగంలో ఆంగ్లంలో "75వ స్వాతంత్ర్యం(75TH YEAR OF Independence)" అని కనిపిస్తుంది. అంతర్జాతీయ అంకెలలో ముద్రించిన సంవత్సరం నాణెం ఎడమ అంచు మధ్యలో కనిపిస్తుంది.
3. ఐదు రూపాయలు
- ముందుభాగం
కొత్త రెండు రూపాయి నాణెం ముందుభాగం (obverse-ఫ్రంట్ ఫేస్)లో "సత్యమేవ జయతే" అనే జాతీయ నినాదంతో భారత జాతీయ చిహ్నమైన "అశోక స్తంభం సింహం క్యాపిటల్" ఉంటుంది. ఎడమ అంచున "భారత్" (భారత్) అనే హిందీ పదం.. కుడి అంచున "ఇండియా" అనే ఇంగ్లీష్ పదం ఉంటుంది.
- వెనుకభాగం
5 రూపాయల నాణెం వెనుకభాగంలోని మధ్యలో “ఆజాది కా అమృత మహోత్సవ్” (Azadi Ka Amrit Mahotsav-आज़ादी का अमृत महोत्सव) అధికారిక లోగో ఇమేజ్ ఉంటుంది. రూపాయి సింబల్ "₹"తో పాటు అంతర్జాతీయ సంఖ్యా విలువ "5" లోగో చిత్రం కింద కనిపిస్తుంది. నాణెం పైభాగంలో ఆంగ్లంలో "75వ స్వాతంత్ర్యం(75TH YEAR OF Independence)" అని కనిపిస్తుంది. అంతర్జాతీయ అంకెలలో ముద్రించిన సంవత్సరం నాణెం ఎడమ అంచు మధ్యలో కనిపిస్తుంది.
Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్‌తో వృద్ధాప్యంలో ఆర్థిక భరోసానిచ్చే స్కీమ్
4. పది రూపాయలు
- ముందుభాగం
కొత్త రూ.10 నాణెం ముందుభాగం (obverse-ఫ్రంట్ ఫేస్)లో "సత్యమేవ జయతే" అనే జాతీయ నినాదంతో భారత జాతీయ చిహ్నమైన "అశోక స్తంభం సింహం క్యాపిటల్" ఉంటుంది. ఎడమ అంచున "భారత్" (భారత్) అనే హిందీ పదం.. కుడి అంచున "ఇండియా" అనే ఇంగ్లీష్ పదం ఉంటుంది.
- వెనుకభాగం
పది రూపాయల నాణెం వెనుకభాగంలోని మధ్యలో “ఆజాది కా అమృత మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav-आज़ादी का अमृत महोत्सव)” అధికారిక లోగో ఇమేజ్ ఉంటుంది. రూపాయి సింబల్ "₹"తో పాటు అంతర్జాతీయ సంఖ్యా విలువ "10" లోగో ఇమేజ్ దిగువన కనిపిస్తుంది. నాణెం పైభాగంలో ఆంగ్లంలో "75వ స్వాతంత్ర్యం(75TH YEAR OF Independence)" అని కనిపిస్తుంది. అంతర్జాతీయ అంకెలలో ముద్రించిన సంవత్సరం నాణెం ఎడమ అంచు మధ్యలో కనిపిస్తుంది.
5. ఇరవై రూపాయలు
- ముందుభాగం
కొత్త రూ.20 నాణెం ముందుభాగం (obverse-ఫ్రంట్ ఫేస్)లో "సత్యమేవ జయతే" అనే జాతీయ నినాదంతో భారత జాతీయ చిహ్నమైన "అశోక స్తంభం సింహం క్యాపిటల్" ఉంటుంది. ఎడమ అంచున "భారత్" (భారత్) అనే హిందీ పదం.. కుడి అంచున "ఇండియా" అనే ఇంగ్లీష్ పదం ఉంటుంది.
- వెనుకభాగం
20 రూపాయల నాణెం వెనుకభాగంలోని మధ్యలో “ఆజాది కా అమృత మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav-आज़ादी का अमृत महोत्सव)” అధికారిక లోగో ఇమేజ్ ఉంటుంది. రూపాయి సింబల్ "₹"తో పాటు అంతర్జాతీయ సంఖ్యా విలువ "20" లోగో ఇమేజ్ దిగువన కనిపిస్తుంది. నాణెం పైభాగంలో ఆంగ్లంలో "75వ స్వాతంత్ర్యం(75TH YEAR OF Independence)" అని కనిపిస్తుంది. అంతర్జాతీయ అంకెలలో ముద్రించిన సంవత్సరం నాణెం ఎడమ అంచు మధ్యలో కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Currency, Finance minister, India, NDA