Bank Account | చెక్ బుక్ చాలా మంది వాడుతూనే ఉంటారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించాలంటే చెక్ బుక్ (Cheque Book) కావాల్సిందే. చెక్ బుక్ కలిగిన వారు చెక్ జారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అకౌంట్‌లో (Bank Account) డబ్బులు లేకుండా చెక్ జారీ చేస్తే.. అసలుకే మోసం వస్తుంది. ఆ చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చెక్ బౌన్స్ కేసులను కూడా మనం చాలానే చూస్తూ ఉంటాం. అయితే ఆర్థిక శాఖ ఈ చెక్ బౌన్స్ కేసులకు కళ్లెం వేయాలని భావిస్తోంది. చెక్ జారీ చేసే వారి ఇతర బ్యాంక్ ఖాతాలను చెక్ బుక్‌కు లింక్ చేయడం, అలాగే చెక్ బౌన్స్ అయిన వారు మళ్లీ కొత్త అకౌంట్లను ఓపెన్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక శాఖకు ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో చెక్ బౌన్స్ అంశానికి సంబంధించి చాలా సూచనలు, సలహాలు అందాయి. వీటిల్లో కొన్నింటిని గమనిస్తే.. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు తక్కువ ఉంటే.. అప్పుడు ఇతర బ్యాంక్ ఖాతాలోని డబ్బులను కట్ చేసుకునేలా కొత్త రూల్స్ తీసుకురావడం ఒకటి ఉంది. అంతేకాకుండా చెక్ బౌన్స్ అయితే దాన్ని లోన్ డిఫాల్ట్‌గా భావించాలని కొందరు సూచించారు.
కారు కొంటే రూ.లక్ష తగ్గింపు.. కంపెనీ బంపరాఫర్!
అంటే లోన్ డిఫాల్ట్ అయితే అప్పుడు ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇలా చెక్ బౌన్స్ అయితే లోన్ డిఫాల్ట్ అయినట్లు గుర్తించాలని కొందరు సిఫార్సు చేశారు. ఈ కొత్త ప్రతిపాదనలు అమలులోకి వస్తే.. చెక్ బౌన్స్ అయితే కోర్టులకు వెళ్లాల్సిన పని ఉండదని చెప్పుకోవచ్చు.
ఎస్‌బీఐ శుభవార్త.. లోన్ తీసుకునే వారికి కేక పుట్టించే ఆఫర్లు!
అలాగే అకౌంట్‌లో డబ్బులు లేకున్నా, తక్కువగా ఉన్నా ఇకపై ఖాతాదారులు చెక్ జారీ చేయకుండా ఉంటారు. బ్యాంకుల డేటా ఇంటిగ్రేషన్ ద్వారా ఈ కొత్త ప్రతిపాదనలను అమలు చేసే అవకాశం ఉంది. ఆటో డెబిట్ సహా ఇతర సూచనల అమలుకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) అవసరం అవుతుంది.
కాగా చెక్ బౌన్స్ అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద కేసు పెట్టొచ్చు. ఇలాంటి వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. అలాగే జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. జరిమానా చెక్ అమౌంటకు రెండు రెట్లు కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతోపాటు జరిమనా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసులు చాలానే ఉన్నాయి. 35 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Banks, Cheque, Finance minister, Money