EPFO: ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం... ఆమోదించిన ఆర్థిక శాఖ

ప్రతీకాత్మక చిత్రం

EPFO | ఖాతాదారులకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO తీసుకున్న నిర్ణయానికి ఆర్థిక శాఖ విభాగమైన ఆర్థిక సేవల విభాగం ఆమోదం తెలిపిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

  • Share this:
    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును 8.65 శాతానికి ఆమోదం తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌కు ఇది వర్తిస్తుంది. సంఘటిత రంగంలో పనిచేస్తున్న 6 కోట్ల మందికి మేలు చేకూరుస్తుందని అంచనా. ఖాతాదారులకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO తీసుకున్న నిర్ణయానికి ఆర్థిక శాఖ విభాగమైన ఆర్థిక సేవల విభాగం ఆమోదం తెలిపిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

    Read this: EPF Nomination: ఈపీఎఫ్‌కు నామినీ తప్పనిసరి... ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేయండి ఇలా...

    2016 నుంచి ఈపీఎఫ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 8.55 శాతంగానే కొనసాగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉండగా... తాజాగా ఆమోదముద్ర పడింది. ఇప్పుడు ఆర్థిక శాఖ సమ్మతి తెలపడంతో ఆదాయపు పన్ను శాఖ, కార్మిక శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి వడ్డీ రేటుపై అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తర్వాత పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయాలని 120 ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు వెళ్తాయి. ఇక అప్పటి నుంచి పెరిగిన వడ్డీ ప్రకారమే క్లెయిమ్ సెటిల్మెంట్లు ఉంటాయి.

    Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్

    ఇవి కూడా చదవండి:

    PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

    Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి

    SBI Loans: ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...
    First published: