Aadhaar: ఆధార్‌పై కొత్త ఆర్డర్స్... మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

Aadhaar eKYC | ఆధార్ కేవైసీ సేవల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్థలకు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 27, 2020, 10:16 AM IST
Aadhaar: ఆధార్‌పై కొత్త ఆర్డర్స్... మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
Aadhaar: ఆధార్‌పై కొత్త ఆర్డర్స్... మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ ఆథెంటికేషన్ సేవల్ని అందించేందుకు కొత్త సంస్థల్ని నోటిఫై చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 లోని సెక్షన్ 11ఏ ప్రకారం ఆథెంటికేషన్ తప్పనిసరి. కేంద్ర ఆర్థిక సంస్థ ఎంపిక చేసిన సంస్థల్లో 29 ఇన్స్యూరెన్స్ కంపెనీలున్నాయి. వీటితోపాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI కూడా 9 సంస్థల్ని నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ల ప్రకారం ఈ సంస్థలు నో యువర్ కస్టమర్-KYC కోసం ఆధార్ వివరాలను సేకరించొచ్చు. సమయాన్ని, ఖర్చును తగ్గించేందుకు ఇ-కేవైసీ కూడా చేయొచ్చు.

ఆధార్ చట్టం ప్రకారం ఆధార్ ఆథెంటికేషన్ సేవల్ని ఈ సంస్థలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చాం. అవసరమైన సెక్యూరిటీ, ప్రైవరీ చర్యల్ని తీసుకున్నాం. ఈ సంస్థలు రియల్‌టైమ్‌లో ఇ-కేవైసీ చేస్తాయి. ఇది ముఖ్యంగా చిన్న, రీటైల్ ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు లాభదాయకంగా ఉంటుంది. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు.

అజయ్ భూషణ్ పాండే, ఫైనాన్స్ సెక్రెటరీ

ఆధార్ ఇ-కేవైసీకి కేంద్రం అనుమతి ఇచ్చిన 29 ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇవే...


1. ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
2. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
3. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్4. బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
5. భారతీ ఆక్సా జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
6. ఎక్సైడ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
7. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
8. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
9. మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
10. పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
11. ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
12. ఫ్యూచర్ జనరలి ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
13. రిలయెన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
14. ఏగాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
15. శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
16. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
17. ప్రమెరికా లైఫ్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్
18. కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
19. స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
20. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
21. ఎడల్వీస్ టోకియో లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
22. కెనెరా హెచ్ఎస్‌బీసీ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
23. కొటక్ మహీంద్రా జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
24. ఫ్యూచర్ జనరలి ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
25. అక్కో జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్
26. రాయల్ సుందరమ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
27. అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
28. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
29. రెలిగేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

ఆధార్ ఇ-కేవైసీకి కేంద్రం అనుమతి ఇచ్చిన 9 సెక్యూరిటీ సంబంధిత కంపెనీలు ఇవే...


1. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లిమిటెడ్
2. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్
3. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్
4. సీడీఎస్ఎల్ వెంచర్స్ లిమిటెడ్
5. ఎన్ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్
6. ఎన్ఎస్ఈ డేటా అండ్ అనలిటిక్స్ లిమిటెడ్
7. సీఏఎంఎస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
8. కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
9. లింక్ ఇంక్‌టైమ్ ప్రైవేట్ లిమిటెడ్

ఇవి కూడా చదవండి:

మీ అకౌంట్లోకి రూ.1500 రాలేదా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ విషయాలు మర్చిపోవద్దు

SBI account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ లాభాలు
First published: April 27, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading