పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఫుల్ బడ్జెట్‌లో మరిన్ని వరాలు?

Union Budget 2019 | ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ కావడంతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు చేయలేకపోయామని, ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మరిన్ని వరాలు ఉంటాయని కేంద్ర ఇన్‌చార్జి ఆర్థిక మంత్రి పీయూష్ గోయాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

news18-telugu
Updated: February 7, 2019, 8:38 PM IST
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఫుల్ బడ్జెట్‌లో మరిన్ని వరాలు?
పీయూష్ గోయల్
  • Share this:
ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ భారీగానే వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఏడాదికి రూ.6000 సాయం ప్రకటించారు. ఉద్యోగులు ఊహించని విధంగా రూ.5లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ రిబేట్ ప్రకటించారు. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. అయితే, ఇది శాంపిల్ మాత్రమేనని ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే ఫుల్ బడ్జెట్‌లో మరిన్ని వరాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.ఎకనామిక్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ వరాలు ఇస్తే, సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు సరిపోవన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. కొత్త పథకాల వల్ల పాత సబ్సిడీల్లో కోతపడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా కోత విధించలేదని తేల్చి చెప్పారు.

Budget 2019 Live, Budget News Live Updates, Live Budget News, Union Budget 2019 Live, Railway Budget Live Updates, Railway Budget Live News, Narendra Modi Budget Live, Piyush Goyal Budget, Live Budget 2019 Speech, Kisan samman Nidhi, Rs6000 for Farmers, Scheme for Farmers, కిసాన్ సమ్మాన్ నిధి, రైతులకు కొత్త పథకం, రూ.6000 రైతులకు సాయం
పీయూష్ గోయల్
వ్యక్తిగత ఆదాయ చెల్లింపుదారులకు ఫుల్ బడ్జెట్‌లో మరిన్ని వరాలు ఉంటాయని పరోక్షంగా పీయూష్ గోయల్ సంకేతాలు ఇచ్చారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎక్కువగా పేదలకు పథకాలు తెచ్చే వీలు కలగలేదని పీయూష్ గోయల్ చెప్పారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో మరిన్ని ప్రతిపాదనలు ఉంటాయని తెలిపారు. తాజాగా బడ్జెట్ ప్రకటించిన ప్రకారం రూ.5లక్షల లోపు ఆదాయం ఉంటే వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
First published: February 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు