గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్ల పతనం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశమైంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ పతనానికి కారణం. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. కేంద్ర బడ్జెట్ 2023-24 (Budget 2023-24) తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తొలిసారి ప్రైవేట్ మీడియా సంస్థ అయిన నెట్వర్క్18 కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అదానీ వ్యవహారంపై నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ జోషీ వేసిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.
అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ , ఎస్‌బీఐ వాటాలు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉందని, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు సౌకర్యవంతమైన స్థాయిలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. సాధారణంగా, NPAలు, రికవరీల పరంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపరుడుతోందని చెప్పారు. బడ్జెట్ ప్రభావం మార్కెట్లలో బుల్లిష్‌నెస్‌ను నిలుపుతుందని అభిప్రాయపడ్డారు.
IRCTC Valentine Special Tour: వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
FM #Nirmala Sitharaman (@nsitharaman) speaks on rout in #AdaniStocks during the #BudgetSpeech#AdaniGroup #HindenburgReport #FMToNetwork18 | @18RahulJoshi #UnionBudget2023 pic.twitter.com/Q4eDjO3ZvX
— News18 (@CNNnews18) February 3, 2023
అదానీ గ్రూప్ పలు అవకతవకలకు పాల్పడిందని, అకౌంటింగ్ మోసాలు చేసిందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన సంస్థ హిండెన్‌బర్గ్ కొద్ది రోజుల క్రితం నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక విడుదలైన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌తో పాటు అదానీ పెట్టుబడులు పెట్టిన షేర్ల ధరలు కుప్పకూలుతున్నాయి. రెండేళ్లు పరిశోధన చేసి తాము ఈ నివేదికను తయారు చేశామని, అదానీకి 88 ప్రశ్నలు కూడా సంధించామని హిండెన్‌బర్గ్ ప్రకటించింది. మరోవైపు అదానీ గ్రూప్ ఈ నివేదికపై స్పందిస్తూ 413 పేజీల రెస్పాన్స్ ఇచ్చింది.
IRCTC Bharat Gaurav Train: మరో గుడ్ న్యూస్... సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
కొన్ని రోజులుగా ఇదంతా జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన, ప్రకటన రాలేదు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్వర్క్18 కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో అదానీ వ్యవహారంపై స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adani group, Budget 2023, Nirmala sitharaman