సంపద సృష్టికర్తలకు ప్రోత్సాహం...మందగమనానికి నిర్మల కాయకల్ప చికిత్స...

యూఎస్, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలు కమ్ముకొస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 7:08 PM IST
సంపద సృష్టికర్తలకు ప్రోత్సాహం...మందగమనానికి నిర్మల కాయకల్ప చికిత్స...
నిర్మలా సీతారామన్ (File)
  • Share this:
అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న ఆర్థిక మందగమనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన చర్యలు చేపడుతూ ప్రభుత్వ నిర్ణయాలను పేర్కొంది. ముఖ్యంగా యూఎస్, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలు కమ్ముకొస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే చాలా ఆర్థిక వ్యవస్థల కన్నా మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ ఫైలింగ్ లోని ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. రానున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని నిర్మలా తెలిపారు.

ఆర్థిక ఉద్దీపన చర్యలు ఇవే...

- ప్రి ఫైల్డ్ రిటర్న్స్ ద్వారా పన్నుల స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తాము.
- ఈఎస్ఐసీ లో మార్పులు చేయడం ద్వారా ఉద్యోగిత లభ్యతను పెంచే అవకాశం.
- ఆర్థిక పురోగతికి అడ్డంకిగా ఉన్న 16 సెక్షన్లను తొలగించడం ద్వారా కంపెనీ అధిపతులను నేరారోపితులుగా చూసే సంప్రదాయానికి తెర దించబోతున్నాం.
- స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లపై సర్ చార్జ్ ను తొలగిస్తూ నిర్ణయం.
- సెక్షన్ 56 2(b) ఐటీ యాక్ట్ నుంచి స్టార్టప్స్ మినహాయింపు. అయితే స్టార్టప్స్ డీపీటీఐటీలో రిజిస్టర్ అయి ఉండాలి.- ప్రభుత్వ బ్యాంకులకు మరో రూ.70 వేల కోట్ల అడిషనల్ కాపిటల్ కేటాయింపు. తద్వారా రూ.5 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించే అవకాశం.
- కీలకవడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా వచ్చిన లబ్దిని కస్టమర్లకు బదలాయించి గృహరుణాలు, ఇతర రుణాల వడ్డీలను తగ్గించమని బ్యాంకులకు సిఫారసు.
-నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కార్పోరేషన్స్ ఇకపై ఆధార్ ఆధారిత కేవైసీ అమలు చేయడం ద్వారా సులభ రుణాలు మంజూరు చేసేందుకు అనుమతి.
- పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇకపై రుణం చెల్లించిన కస్టమర్లు 15 రోజుల్లోగా డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే విధంగా విధానాల్లో మార్పు.
- హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు నేషనలల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి రూ.20 వేల కోట్ల అదనపు ఆర్థిక సాయం పొందే అవకాశం.
- ఎంఎస్ఎంఈలు చెల్లించాల్సిన పెండిండ్ జీఎస్టీ రీఫండ్ 30 రోజుల్లోగా చెల్లించేలా వెసులుబాటు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య డిమాండ్ మేరకు జీఎస్టీలో రీఫండ్ లో మార్పులు.
- పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఇకపై పారిశ్రామిక వేత్తలపై ఆర్థిక అవకతవకలకు జరిమానాల రూపంలో శిక్షలు ఉంటాయని నిర్మలా పేర్కొన్నారు. సంపద సృష్టించే పారిశ్రామికవేత్తలను ప్రాసిక్యూట్‌ చేయడం ప్రభుత్వ లక్ష్యం కాదు.
- కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉల్లంఘనలను క్రిమినల్‌ నేరాల కింద పరిగణించబోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- ఎంఎస్‌ఎంఈ రుణాలపై ఒకే సమావేశంలో బ్యాంకు అధికారి పరిష్కారం. రుణాల మంజూరు విషయంలో బ్యాంకు అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకొనేలా చర్యలు. వీలైనంత వరకు అవకతవకలు జరగితే జరిమానాకే ప్రాధాన్యమిస్తామని హామీ. కంపెనీ యాక్ట్ కింద 14వేల ప్రాసిక్యూషన్లు ఉపసంహరించుకున్నామని తెలిపారు.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading