హోమ్ /వార్తలు /బిజినెస్ /

Inflation: ద్రవ్యోల్భణం‌పై Network18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..

Inflation: ద్రవ్యోల్భణం‌పై Network18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Inflation: మరోసారి మానిటరీ పాలసీ రివ్యూ కోసం ఆర్బీఐ వచ్చే వారం భేటీ కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక‌మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈ అంశాల గురించి నెట్‌వర్క్‌ 18తో ప్రత్యేకంగా మాట్లాడారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ద్రవ్యోల్బణం (Inflation) కారణంగా గతేడాది మే నుంచి ఆర్బీఐ కీలక రెపో రేటు (Repo Rate)ను పెంచుతోంది. దీంతో రుణగ్రహీతలకు ఈఎంఐ భారం పెరిగింది. తాజాగా మరోసారి మానిటరీ పాలసీ రివ్యూ కోసం ఆర్బీఐ వచ్చే వారం భేటీ కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక‌మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈ అంశాల గురించి నెట్‌వర్క్‌ 18తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొంతకాలం నుంచి ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీరేట్లను పెంచిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), ద్రవ్య విధాన కమిటీ (MPC)పై ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గడంతో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ నుంచి ద్రవ్యోల్బణం కాస్త తగ్గడంతో ఈ ప్రక్రియలో కొంత సడలింపు ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.

* తగ్గుదల స్థిరంగా ఉండాలి

ద్రవ్యోల్బణం తగ్గుదల అనేది కేవలం తాత్కాలికం లేదా ఒక నెలకు మాత్రమే పరిమితమైనదిగా ఉండకూడదని నిర్మలా సీతారామన్‌ అన్నారు. అది స్థిరంగా తగ్గుతుండాలని, అప్పుడే సెంట్రల్ బ్యాంక్‌పై అంత ఒత్తిడి ఉండదని చెప్పారు. అప్పుడే ఆర్బీఐ రెపో రేట్లు పెంచే అవసరం తగ్గుతుందని తెలిపారు.

* 25 పాయింట్లు పెంచే అవకాశం

వరుసగా మూడో త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం పరిమితిలో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో నిబంధనల ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ ద్రవ్యోల్బణాన్ని ఇరువైపులా 2 శాతం ఎర్రర్ మార్జిన్‌తో 4 శాతం లక్ష్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్బీఐ ఆధ్వర్యంలో మానిటరీ పాలసీ కమిటీ వచ్చేవారం నిర్వహించే సమీక్షలో బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక నిధులపై రెపో రేటును మరో 25 బీపీఎస్‌ పాయింట్లు పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా..? అయితే, ఈ బంపర్ న్యూస్ మీ కోసమే!

* డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.72 శాతం

ఏకధాటిగా ఒక సంవత్సరం పాటు 6 శాతంపైగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది చివర్లో కొద్దిగా తగ్గింది. ఈ తగ్గింపు అనేది ద్రవ్య విధాన రూపకర్తలకు కొంత ఫ్లెక్సిబులిటినీ అందిస్తుంది. CPI(కన్య్జూమర్ ప్రైస్ ఇండెక్స్) ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.88 శాతం నుంచి ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి 5.72 శాతానికి తగ్గింది.

* వరుసగా రెండో నెల తగ్గుదల

సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా మూడో నెల. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం ద్రవ్యోల్బణం 2-6 శాతంలో ఆరు కంటే దిగువకు రావడం వరుసగా ఇది రెండో నెల. స్థిరమైన ప్రాతిపదికన ద్రవ్యోల్బణం తగ్గడం ప్రారంభించడంతో, సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత రెపో రేటు పెంపు సర్కిల్ అనేది ముగింపు దశకు చేరుకుందని కొందరు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

* అప్రమత్తంగా ఉండాల్సిందే

ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కీలకమైన పాలసీ ప్రాధాన్యతల్లో ఒకటన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరువైపులా 2 శాతం ఎర్రర్ మార్జిన్‌తో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో RBI గవర్నర్ దాస్ మాట్లాడుతూ.. ఏ మార్పు అవసరం లేదని భావించడం లేదని, లక్ష్యాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాన ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆరు శాతం కంటే ఎక్కువగానే కొనసాగడం ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుందని దాస్ అన్నారు. ప్రధాన ద్రవ్యోల్బణంపై RBI చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

First published:

Tags: Budget 2023, Inflation, Nirmala sitharaman, Rbi

ఉత్తమ కథలు