Finance Minister Nirmala Sitharaman Meeting with Finance Ministers of states: కేంద్ర బడ్జెట్ 2022-23కు సంబంధించిన కీలక సమావేశాలు న్యూదిల్లీలో జోరందుకున్నాయి. ఇప్పటికే అనేక రంగాలకు చెందిన ప్రతినిధులతో పాటు, ఆర్థిక రంగ నిపుణులు, పన్ను నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్స్ సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) వరుస భేటీలు కావడం ద్వారా బడ్జెట్ సూచనలను స్వీకరించారు. అంతేకాదు నేడు దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ మంత్రులతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి అటు కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక శాఖలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఆ కోవలో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ముఖ్యంగా జిఎస్‌టి పరిహారంతో పాటు, కోల్ బ్లాక్ కంపెనీల నుండి అదనపు లెవీగా వసూలు చేసిన మొత్తాన్ని బదిలీ చేయడం, రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం మోహరించిన భద్రతా దళాలకు ఖర్చు చేసిన రూ. 15,000 కోట్ల తిరిగి కేంద్రం నుంచి రావాలని అభ్యర్థించారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ, 'కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది' అని అన్నారు. జిఎస్‌టి పరిహారంపై, కేంద్రం నుండి పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు , పథకాలపై ఖర్చు చేయగలదని బఘేల్ చెప్పారు.
Year Ender 2021: ఈ ఏడాది ఆండ్రాయిడ్‌లో 8 బెస్ట్ యాప్స్ ఇవే... మీ ఫోన్‌లో ఎన్ని ఉన్నాయి?
మరోవైపు పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక మంత్రులు మాట్లాడుతూ, జిఎస్‌టి పన్ను విధానం వల్ల రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోయిందని అన్నారు. కేంద్రం వచ్చే ఐదేళ్లపాటు జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. ఇక చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ రాబోయే ఏడాదిలో రాష్ట్రానికి దాదాపు రూ. 5000 కోట్ల ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయలేదని, కాబట్టి జూన్ 2022 తర్వాత కూడా వచ్చే ఐదేళ్లపాటు జీఎస్టీ పరిహారం మంజూరును కొనసాగించాలని' అన్నారు.
Tecno Spark 8 Pro: రూ.10,000 బడ్జెట్‌లో టెక్నో స్పార్క్ 8 ప్రో రిలీజ్... ఫీచర్స్ ఇవే
ఇదిలా ఉంటే ఈ సమావేశానికి కొనసాగింపుగా రేపు GST కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది. అందులో సైతం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలోనే కొత్త సంవత్సరం నుంచి దేశంలోని పలు ఉత్పత్తులపై విధించే వస్తు, సేవల పన్ను (GST) రేట్లు మారనున్నాయి. పన్ను మార్పు వల్ల ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌లు ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర ఉత్పత్తి దారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.