FINANCE MINISTER NIRMALA SITHARAMAN MAKES KEY STATEMENT ON MORATORIUM AND REFORMS AMID CORONA SECOND WAVE HSN
Cororna Second Wave: క్రెడిట్ కార్డు EMI, బ్యాంకు రుణాలపై మళ్లీ మారటోరియం విధిస్తారా..? కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ప్రతీకాత్మక చిత్రం
ఈ కరోనా కల్లోలంలో సామాన్యుడు జీవనం సాగించడమే కష్టంగా మారింది. దీంతో మళ్లీ బ్యాంకు లోన్లపై, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐలపై మారటోరియం విధిస్తారా..? అన్న అంశంపై రుణగ్రహీతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..
మళ్లీ ఏడాది క్రితం నాటి రోజులు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలోనూ రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు గతేడాది అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆర్థికరంగం కోలుకుంటోంటే మళ్లీ మరోసారి రూపం మార్చుకుని మానవాళిపై కరోనా విరుచుకుపడుతోంది. దీంతో కేంద్రం సాయంతో అన్ని రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూని విధిస్తున్న ప్రభుత్వాలు, అవసరమైన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కూడా పెడుతున్నాయి. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు ఉండటంతో అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవతం చేసి కరోనాకు అడ్డుకట్ట వేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
పెరిగిన ధరలతో, ఈ కరోనా కల్లోలంలో సామాన్యుడు జీవనం సాగించడమే కష్టంగా మారుతోంది. దీంతో మళ్లీ బ్యాంకు లోన్లపై, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐలపై మారటోరియం విధిస్తారా..? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకు ఏమైనా సూచనలుచేస్తుందా? అన్న అంశంపై రుణగ్రహీతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో మొదట్లో మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు అన్ని రుణాలపై మారటోరియం విధిస్తూ కేంద్రం, ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయాన్ని తీసుకున్నాయి. వెసులు బాటు ఉన్నవాళ్లు లోన్ కట్టొచ్చని కూడా ప్రకటించాయి. తాజాగా మళ్లీ సెకండ్ వేవ్ దెబ్బకు మరోసారి రుణగ్రహీతలు మారటోరియం ఉంటుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై శుక్రవారం నిర్వహించిన ఆన్ లైన్ మీడియా మీట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
‘కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పటికీ బడ్జెట్ లో ప్రతిపాదించిన అన్ని సంస్కరణలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. వాటిని ఆపే ప్రసక్తే లేదు. ఆయా రంగాల్లో పెట్టుబడుల ఉప సంహరణ ప్రక్రియను గతంలో చెప్పినట్టుగానే ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో అక్కడక్కడా లాక్ డౌన్ అమలు అవుతోంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ తెరిచే ఉంది. అందువల్ల మళ్లీ బ్యాంకులోన్లపై, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐలపై మారటోరియం పెట్టే ఆలోచన ప్రస్తుతానికి లేదు‘ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.