బ్యాంకులో ఖాతా ఉందా? అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సర్వీసులు మీకోసమే

బ్యాంకులో ఖాతా ఉందా? అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సర్వీసులు మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త సేవలు లభించనున్నాయి. ఆ సర్వీస్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

 • Share this:
  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా-BOB, కెనెరా బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నవారికి శుభవార్త. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ప్రారంభించారు. ఖాతాదారులు ఇబ్బందులు లేకుండా, సులభంగా బ్యాంకింగ్ సేవల్ని పొందేందుకు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆర్థిక పునరుజ్జీవనంలో బ్యాంకుల పాత్ర కీలకం అని ఆమె అన్నారు. బ్యాంకింగ్ సేవలు అందని ప్రాంతాలను బ్యాంకులు చేరుకోవాలని కోరారు. అంతేకాదు... ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలపై బ్యాంకు సిబ్బందికి అవగాహన ఉండాలని, వాటిని బ్యాంకుల ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. దేశంలోని 100 కేంద్రాల్లో ఎంపిక చేసిన సర్వీస్ ప్రొవైడర్లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్లను నియమించి సేవల్ని అందించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కస్టమర్లు సాధారణ ఛార్జీలు చెల్లించి ఈ సేవల్ని పొందొచ్చు. వృద్ధులు, దివ్యాంగులు సహా కస్టమర్లందరికీ ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

  Investment Idea: ఎక్కువ లాభాలు కావాలా? ఇలా ఇన్వెస్ట్ చేయండి

  EPFO new rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ పెరిగింది

  కాల్ సెంటర్, వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని తమకు అనుకూలమైన సమయంలో పొందొచ్చు. తమ సర్వీస్ రిక్వెస్ట్‌ని కస్టమర్లు ట్రాక్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. చెక్, డీడీ, పేఆర్డర్, అకౌంట్ స్టేట్‌మెంట్, చెక్ బుక్ లాంటి సేవలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ సేవలు కూడా వృద్ధులకే లభిస్తున్నాయి. అయితే అక్టోబర్ 1 నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కస్టమర్లందరికీ లభిస్తాయి. అయితే ఏఏ సర్వీసులకు ఛార్జీలు ఎంత ఉంటాయి, వాటిని కస్టమర్లు ఏ విధంగా పొందాలి అన్న వివరాలు త్వరలోనే బ్యాంకులు వెల్లడిస్తాయి.
  Published by:Santhosh Kumar S
  First published: