Corona Package: మూడో కరోనా ప్యాకేజీని సిద్ధం చేస్తున్న మోదీ ప్రభుత్వం...

కరోనా సంక్షోభం సమయంలో, భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటానికి కేంద్ర ప్రభుత్వం మూడో ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: October 19, 2020, 10:39 PM IST
Corona Package: మూడో కరోనా ప్యాకేజీని సిద్ధం చేస్తున్న మోదీ ప్రభుత్వం...
నిర్మలా సీతారామన్
  • Share this:
కరోనా సంక్షోభం సమయంలో, భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటానికి కేంద్ర ప్రభుత్వం మూడో ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశం ముందు తలెత్తే పరిస్థితిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి మరో ప్రోత్సాహక ప్యాకేజీ ఎంపిక ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. జిడిపి క్షీణతకు గల కారణాలను ప్రభుత్వం అంచనా వేయడం ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేంద్రం ముఖ్యమైన సమాచారాన్ని సేకరించింది. త్వరలోనే పార్లమెంటులో అయినా సరే, మరో సందర్భంలో అయినా సరే ప్రజల ముందు ప్యాకేజీని ప్రకటిస్తామని ఆమె సంకేతాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలకు (పిఎస్‌యు) ఆర్థిక మంత్రి సీతారామన్ కఠినమైన సూచనలు ఇచ్చారు. పెద్ద పిఎస్‌యు కంపెనీలు 2020 డిసెంబర్ నాటికి ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయంలో 75 శాతం పూర్తి చేయాలని ఆమె అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ -19 యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శులు వాటికి అనుసంధానించబడిన 14 పిఎస్‌యు కంపెనీల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్లతో ఆన్‌లైన్ సమావేశంలో, కాపిటల్ ఎక్స్ పెండిచర్ పథకాలపై వేగంగా పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటానికి ఆర్థిక మంత్రి నాలుగో సమావేశంలో పిఎస్‌యు కంపెనీల పనితీరును సమీక్షించారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి వారు చేసిన మూలధన వ్యయం ఎంతో సహాయపడుతుందని అన్నారు. అందువల్ల వారు 2020-21 మరియు 2021-22 సంవత్సరాలకు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయాలన్నారు. కేంద్ర పిఎస్‌యు కంపెనీల పనితీరును నిశితంగా పరిశీలించాలని, 2020-21 సంవత్సరానికి వారి స్థిర మూలధన వ్యయంలో 75 శాతం డిసెంబర్‌ నాటికి ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులను కోరారు.

మూలధన వ్యయం లక్ష్యాన్ని సాధించడానికి, సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో పాటు పిఎస్‌యు కంపెనీల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. 2019-20లో 14 కేంద్ర పిఎస్‌యు కంపెనీలు మొత్తం మూలధన వ్యయం రూ. 1,11,672 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయని, అయితే వాటి వ్యయం 104 శాతం అంటే రూ .1,16,323 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీలు రూ .1,15,934 కోట్ల మూలధన వ్యయ లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఇది 2020 సెప్టెంబర్ వరకు మొదటి అర్ధభాగంలో 37,423 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించింది, అయితే 2019-20 మొదటి అర్ధభాగంలో ఇది 39 శాతం అంటే రూ .43,097 కోట్లుగా నమోదైంది.
Published by: Krishna Adithya
First published: October 19, 2020, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading