news18-telugu
Updated: October 14, 2019, 8:37 PM IST
నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ (Twitter)
దేశంలోని ఆర్థిక స్థితి మందగమనంపై సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ ఆర్థిక వేత్త పరకాల ప్రభాకర్ స్పందించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ది హిందూ పత్రికలో పరకాల ప్రభాకర్ రాసిన ఒక వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరుసగా పలు సెక్టార్లు దెబ్బతింటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించేందుకు సిద్ధంగా లేదని తన వ్యాసంలో విమర్శించారు. అలాగే మేధావి వర్గం సలహాలు ఇవ్వడంలో విఫలమైందని పరకాల అన్నారు. అలాగే నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్థిక విధానాలకు బాటలు చూపిన పీవీ నరసింహారావు, మన్ మోహన్ సింగ్ ఆర్థిక నమూనాను అవలంబిచాలని పరకాల సూచించారు.
Published by:
Krishna Adithya
First published:
October 14, 2019, 8:36 PM IST