హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021: వాహనదారులకు అలర్ట్.. ఆ ఏడాది కన్నా ముందు కొన్న వెహికిల్స్ అన్నీ తుక్కు కిందకే.. తెలుసుకోండి

Union Budget 2021: వాహనదారులకు అలర్ట్.. ఆ ఏడాది కన్నా ముందు కొన్న వెహికిల్స్ అన్నీ తుక్కు కిందకే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద కాలుష్యం వెదజల్లుతున్న 20 ఏళ్లకు పైబడ్డ వాహనాలు తుక్కు కింద మారనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద కాలుష్యం వెదజల్లుతున్న 20 ఏళ్లకు పైబడ్డ వాహనాలు తుక్కు కింద మారనున్నాయి. దీంతో 2000 సంవత్సరానికి ముందు మీరు టాక్సీ లేదా ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలు కొని ఉన్నట్లైతే ఇక మీ వాహనం రోడ్డెక్కేందుకు అవకాశం లేదు. దీంతో మనదేశంలో కనీసం మిలియన్ల కొద్దీ కమర్షియల్ వెహికల్స్ ఆటోమేటిక్ గా తుక్కు కిందకు మారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇలా పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్తవి కొనేవారికి ప్రభుత్వం కొన్ని పన్నుల నుంచి ఉపశమనం ఇస్తుంది. కొత్త వాహనం కొనేప్పుడు జీఎస్టీలో డిస్కౌంట్ పొందచ్చు. ఇందులో భాగంగా కమర్షియల్ వెహికల్ కొనేందుకు 28శాతం చెల్లించాల్సిన జీఎస్టీని 18 శాతానికి తగ్గించే ఛాన్సులున్నాయి. దీంతో సుమారు కోటి వెహికల్స్ స్క్రాప్ కింద మారిపోనున్నాయి. కాలపరిమితి ముగిసిన వెహికల్స్ అన్నీ ఫిట్నెస్ టెస్టు చేయించాల్సిందే. ఇప్పటికే 15 ఏళ్లు దాటిన పాత వాహనాలన్నింటిపై గ్రీన్ టాక్స్ ను కేంద్రం వసూలు చేస్తోంది. సరికొత్త విధానాల ప్రకారం 20 ఏళ్ల

పాతబడ్డ పర్సనల్ వాహనాలన్నీ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లి ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాల్సిందేనంటూ కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇది అత్యుత్తమ విధానంగా కేంద్ర్ భావిస్తోంది. ఇంధన వినియోగాన్ని నియంత్రించేలా, వాతావరణ పరిరక్షణకు ఇది ఊతమిస్తుందని కేంద్రం గట్టిగా విశ్వసిస్తోంది.

15 రోజుల్లో కొత్త పాలసీ..

లైట్, మీడియం, హెవీ మోటర్ వెహికల్స్ సుమారు కోటికి పైగా స్క్రాప్ పాలసీ కింద అతి త్వరలో మారనున్నట్టు కేంద్రం అంచనా వేస్తోంది. మరో 15 రోజుల్లో ఈ పాలసీ విధి విధానాలు మరింత వివరంగా ప్రకటించనున్నట్టు కేంద్ర రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

గ్లోబల్ ఆటోమొబైల్ హబ్

కాలుష్య నివారణకు వాహనాల స్క్రాపింగ్ పాలసీ తప్పనిసరిగా మారింది. 20 ఏళ్ల పైబడ్డ 51 లక్షల లైట్ మోటర్ వెహికల్స్, 15 ఏళ్ల పైబడ్డ34 లక్షల లైట్ మోటర్ వెహికల్స్, 17 లక్షల మీడియం అండ్ హెవీ మోటర్ వెహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సంపాదించకపోతే తుక్కు కింద మారిపోతాయన్నమాట. ఈ తుక్కును కొత్త వాహనాల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగించవచ్చు. దీంతో రానున్న ఐదేళ్లలో ఇండియా "ఆటోమొబైల్ హబ్" గా మారటం ఖాయమని కేంద్రం అంచనా వేస్తోంది.

ప్రస్తుతం మనదేశంలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన వాహనాల మార్కెట్ సమీప భవిష్యత్తులో 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇలా ఒకటిన్నర దశాబ్దానికి పైబడ్డ వాహనాలు 10-12 రెట్లు ఎక్కువ కాలుష్యానికి కారకాలు అవుతాయి. కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సీఎన్జీ, ఎలక్ట్రిక్, ఈథనాల్, హైబ్రిడ్ వాహనాల వైపు మొగ్గుచూపాలని కేంద్రం ప్రోత్సహిస్తోంది. పెట్రో, డీజల్ వంటి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారం కూడా కొత్త స్క్రాపింగ్ పాలసీ పూర్తిగా తగ్గించనుంది.

First published:

Tags: Budget 2021, Indian parliament, Nirmala sitharaman, Union Budget 2021

ఉత్తమ కథలు