Nirmala Sitharaman News | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాస్పిటల్‌లో చేరారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఈమెను జాయిన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్‌లోని (AIIMS) ప్రైవేట్ వార్డులో ఈమె చేరినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వయసు 63 ఏళ్లు.
నిర్మలా సీతారామన్ వార్షిక రెగ్యులర్ చెకప్‌లో భాగంగా హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. సీరియస్ ఏమీ లేదని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం నిర్మలా సీతారామన్ హాస్పిటల్ చేరిక అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
కస్టమర్లకు ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఆ చార్జీలు మాఫీ!
నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రజా వ్యయం పెరిగినే నేపథ్యంలో వృద్ధిని పరుగులు పెట్టించేలా ఈసారి బడ్జెట్‌ను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఎందుకంటే ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదు. అయితే గత నెలలో చూస్తే ధరలు కొంత మేర శాంతించాయని చెప్పుకోవచ్చు.
ఒక్కసారి చార్జింగ్ పెడితే 300 కి.మి వెళ్లొచ్చు.. టాప్-12 ఎలక్ట్రిక్ టూవీలర్లు ఇవే!
కాగా ఇప్పటకే నిర్మలా సీతారామన్ ప్రిబడ్జెట్ సెషన్లను నిర్వహించారు. వర్చువల్ మీటింగ్స్ రూపంలో ప్రిబడ్జెట్ సెషన్లు పూర్తి అయ్యాయి. నవంబర్ 21 నుంచి 28 వరకు ప్రిబడ్జెట్ కన్సల్టింగ్ మీటింగ్స్ జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నిశితంగా గమనిస్తూ వస్తోందని నిర్మలా సీతారామన్ గత వారంలో వెల్లడించారు. ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణాన్ని మంచిగా హ్యాండిల్ చేస్తామని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. సరఫరాల వైపు నుంచి ఒత్తిడి లేకుండా చూశామని తెలిపారు. దీని వల్ల ఆహార ధరలపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణ లక్ష్యం కన్నా ఇంకా దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని 6 శాతంగా నిర్దేశించుకుంది. ఇకపోతే వచ్చే యూనియన్ బడ్జెట్‌పై చాలా మందికి చాలానే ఆశలు ఉన్నాయి. పన్ను చెల్లింపుదారుల నుంచి సామాన్యుల వరకు ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.