రూ.5000 ఫైన్ తప్పించుకోవడానికి వెంటనే ఈ పని చేయండి

రూ.5000 ఫైన్ తప్పించుకోవడానికి వెంటనే ఈ పని చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

ఆర్థిక లావాదేవీలు జరిపేవారు ప్రతీ చివరి తేదీని గుర్తుంచుకోకతప్పదు. లేకపోతే కొన్ని సందర్భాల్లో భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అందుకే లాస్ట్ డేట్ కన్నా ముందే పనులు ముగించడం మంచిది.

  • Share this:
    మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్-ITR ఫైల్ చేశారా? ఇంకా చేయలేదా? 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2020 డిసెంబర్ 31 లాస్ట్ డేట్. ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పలుమార్లు చివరి తేదీని పొడిగించింది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఇక మళ్లీ లాస్ట్ డేట్ పొడిగించే అవకాశం లేదు. కాబట్టి చివరి తేదీ లోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీ అంటే డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.5,000 పెనాల్టీ వసూలు చేయనుంది ఆదాయపు పన్ను శాఖ. ఈ ఫైన్ రూ.10,000 వరకు వెళ్లొచ్చు. ఇప్పటికే చాలామంది ఐటీఆర్ ఫైల్ చేయలేదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకొన్ని రోజులే గడువుంది. చివర్లో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చనుకుంటే సాంకేతిక సమస్యలు రావచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేసి రూ.5000 ఫైన్ తప్పించుకోండి.

    IRCTC PNR Status: మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

    RTGS: ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్... ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే

    ఆదాయపు పన్ను శాఖకు చెందిన https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్‌లో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత వేర్వేరు ఫామ్స్ ఉంటాయి. వేతనజీవులు, పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న వారు ITR-1, క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు ITR-2, ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్లు ITR-3, ITR-4, ITR-4S ఫామ్స్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ మొదలు పెట్టే ముందు అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకోవాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫామ్ 16, మీ పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లాంటివి సిద్ధం చేసుకోవాలి. అవసరమైన చోట అప్‌లోడ్ చేయాలి. చివరగా చెల్లించాల్సిన పన్ను ఏదైనా ఉంటే ట్యాక్స్ డ్యూ చెల్లించి సబ్మిట్ చేయాలి. ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో వివరంగా తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన ఈ వీడియో చూడండి.

    SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు

    Post Office Savings Account: ఖాతాదారులకు అలర్ట్... మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారాయి


    ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత వివరాలన్నీ ఓసారి సరిచూసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఆదాయపు పన్ను శాఖ సూచించిన చివరి తేదీ లోగా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేకపోతే రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రూ.25 లక్షల కన్నా ఎక్కువ పన్ను ఎగవేసినట్టు తేలితే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: