Credit Card Discounts: ఫెస్టివల్ సీజన్‌లో ఈ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు

Credit Card Discounts: ఫెస్టివల్ సీజన్‌లో ఈ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు (ప్రతీకాత్మక చిత్రం)

Credit Card Discounts | ఆన్‌లైన్‌లో ప్రత్యేకమైన భాగస్వాములతో అమెజాన్, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్, అర్బన్‌క్లాప్ ఉత్పత్తుల కొనుగోలుపై 10X రివార్డ్ పాయింట్లు మరియు ఇతర అన్ని ఆన్‌లైన్ చెల్లింపులపై 5X రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

  • Share this:
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఇ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్ డేస్ పేర్లతో సేల్ ప్రారంభించాయి. ఈ రెండు సేల్స్ అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వీటితో పాటు ఇతర షాపింగ్ ప్లాట్‌ఫాంలు కూడా ఫెస్టివల్ సీజన్లో అమ్మకాలు పెంచుకోవడం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు డెబిట్, క్రెడిట్ కార్టుల చెల్లింపులపై ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాయి. వీటికోసం క్రెడిట్ కార్డు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలకు చెందిన క్రెడిట్ కార్టు చెల్లింపులపై వర్తించనున్న ఆఫర్లను తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా కార్డు


పేజాప్, స్మార్ట్‌బ్యూ ప్లాట్ఫాం ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో జరిపే కనీసం రూ .2,000 ట్రాన్సాక్షన్స్‌రో 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. కనీసం రూ.2,000 నుంచి జరిపే అన్ని ఆన్‌లైన్ చెల్లింపులపై 2.5 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. అన్ని ఆఫ్‌లైన్ చెల్లింపులు మరియు వాలెట్ రీలోడ్‌లపై 1 శాతం క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. కనీసం రూ.100 చేసే ట్రాన్సాక్షన్‌కే ఇది వర్తిస్తుంది. అన్ని ఇంధన స్టేషన్లలో చేసే కనీస రూ.400 చెల్లింపులపై 1 శాతం ఇంధన సర్‌చార్జ్ మాఫీ అవుతుంది. పైన పేర్కొన్న అన్ని క్యాష్‌బ్యాక్లు క్యాష్‌పాయింట్ల రూపంలో ఇవ్వబడుతాయి.

Flash Sale: ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ... ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే

Festival Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్... ఇలా పొందండి

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై ఫెస్టివల్ ఆఫర్లు


హెడిఎఫ్సి కార్టులతో కొనుగోలుచేసే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎల్‌జీ, సోనీ, రిలయన్స్ డిజిటల్, వోల్టాస్, గోద్రేజ్, క్యారియర్, వర్ల్పూల్ మరియు ఇతర ఉత్పత్తులపై 22.5 శాతం క్యాష్‌బ్యాక్ మరియు నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. స్విగ్గి, జొమాటో మరియు లూయిస్ ఫిలిప్, పీటర్ ఇంగ్లాండ్, వాన్ హ్యూసెన్, అడిడాస్, ఫరెవర్ 21, టర్టిల్ ఉత్పత్తుల కొనుగోలుపై తక్షణ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్లో స్మార్ట్ బై ద్వారా 10 శాతం ఇన్స్టన్ట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ట్రా సేవింగ్స్ పొందొచ్చు.

ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ కార్డుపై


ఆన్‌లైన్‌లో ప్రత్యేకమైన భాగస్వాములతో అమెజాన్, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్, అర్బన్‌క్లాప్ ఉత్పత్తుల కొనుగోలుపై 10X రివార్డ్ పాయింట్లు మరియు ఇతర అన్ని ఆన్‌లైన్ చెల్లింపులపై 5X రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇంధన స్టేషన్లలో రూ .500 నుంచి రూ .3,000 మధ్య చేసే ప్రతి చెల్లింపుకు1 శాతం ఇంధన సర్‌చార్జ్ మాఫీ అవుతుంది.

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Flipkart SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ఎంత వస్తుందంటే

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై ఫెస్టివల్ ఆఫర్లు


అక్టోబర్ 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో చేసే ప్రతి కొనుగోలుపై 10 శాతం తక్షణ తగ్గింపు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ బజ్ కార్డుపై


ఫ్లిప్‌కార్ట్, మింత్రా, 2గుడ్‌లో చేసే కొనుగోలుపై 5 శాతం క్యాష్ బ్యాక్. అంతేకాక క్యూర్ ఫిట్, గోబిబో, మేక్ మై ట్రిప్, పీవీఆర్, యూబర్ చెల్లింపులపై 4 శాతంక్యాష్ బ్యాక్, మిగతా అన్ని చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్. మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ క్యాష్ బ్యాక్ నేరుగా జమ అవుతుంది.

అన్ని ఇంధన స్టేషన్లలో ఇంధన కొనుగోళ్లపై 1 శాతం ఇంధన సర్‌చార్జ్ మాఫీ. ఇది రూ .400 నుంచి రూ .4 వేల మధ్య లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది. పార్ట్నర్ రెస్టారెంట్లలో చేసే చెల్లింపులపై 20 శాతం వరకు తగ్గింపు.

అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డుపై


అమెజాన్.ఇన్లో చేసే కొనుగోలుపై అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 5 శాతం క్యాష్బ్యాక్, అదే నాన్ ప్రైమ్ కస్టమర్లకు అయితే 3 శాతం క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. 100కు పైగా అమెజాన్ పే భాగస్వామి వ్యాపార సంస్థల్లో షాపింగ్, డైనింగ్, ఇన్సూరెన్స్ వంటి చెల్లింపులకు 2 శాతం క్యాష్ బ్యాక్, ఇతర అన్ని కొనుగోళ్లకు 1 శాతం క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఇంధన స్టేషన్లలో చేసే చెల్లింపులపై 1 శాతం ఇంధన సర్‌చార్జి మాఫీ అవుతుంది.

హెచ్ఎస్‌బీసీ కార్డుపై


రూ .400కు మించి చేసే స్విగ్గి ఆర్డర్‌లపై 20 శాతం రాయితీ. అమెజాన్‌లో రూ .1,000 లేదా అంతకంటే ఎక్కువ చేసే చెల్లింపులపై 5 శాతం తగ్గింపు . ఇతర అన్ని ఆన్లైన్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్బ్యాక్. 1000కి పైగా రెస్టారెంట్లలో చేసే చెల్లింపులపై 15 శాతం క్యాష్బ్యాక్ వర్తిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్స్ అన్నీ 45 రోజుల్లో చెల్లించబడుతాయి.
Published by:Santhosh Kumar S
First published: