హోమ్ /వార్తలు /బిజినెస్ /

Shoping Tips: ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

Shoping Tips: ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

Shoping Tips: ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

Shoping Tips: ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

Shoping Tips: ఫెస్టివల్ సేల్, స్పెషల్ ఆఫర్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ముందు కొన్ని టిప్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో ఫెస్టివల్ సీజన్ (Festival Season) ప్రారంభమైంది. దీంతో అన్ని సంస్థలు తమ మార్కెట్‌ను పెంచుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఇ-కామర్స్ సంస్థలు మొదలుకొని రిటైల్ స్టోర్స్ వరకు పలు ప్రొడక్ట్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు (Offers), ఇన్‌స్టంట్ డిస్కౌంట్ల (Discounts)తో కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్ ధమాకా నవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా, దీపావళి వరకు కొనసాగనుంది. అయితే స్పెషల్ ఆఫర్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ముందు కొన్ని టిప్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.

* భారీ ఆఫర్లను చూసి మోసపోవద్దు

కొన్నిసార్లు ఆన్‌లైన్ రిటైలర్స్ ఎంపిక చేసిన వస్తువులపై 50-70 శాతం వరకు భారీ డిస్కౌంట్ ప్రకటిస్తాయి. ఆ ఆఫర్ కూడా పరిమిత సమయం వరకు మాత్రమే ఉంటుంది. అయితే కస్టమర్లు ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఏ వస్తువుపైనా అంత భారీ డిస్కౌంట్ ఎవరూ ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా అవి నకిలీవి కావచ్చు లేదా దొంగలించినవి కావచ్చు. లేదా ఎక్స్‌పైర్ డేట్ తీరినవైనా ఉండవచ్చు. కాబట్టి సదరు ప్రొడక్ట్‌ను నిశితంగా పరిశీలించాలి. అదే ప్రొడక్ట్ ఆఫ్‌లైన్ లేదా ఫిజికల్ స్టోర్స్‌లో ఎంత ధరకు అందుబాటులో ఉందో చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి షాపింగ్ చేయాలి.

* ప్రొడక్ట్ అవసరమేనా?

ఏదైనా చౌకగా లభిస్తుంటే ఎవరికైనా కొనాలనిపిస్తుంది. అయితే ఆ వస్తువు అవసరం ఇప్పుడు ఉంటేనే కొనుగోలు చేయాలి. కొందరు కొన్ని వస్తువులను పదేపదే కొనుగోలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల డబ్బు వ‌ృథా అవుతుంది. పైగా ఆ వస్తువులతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా డబ్బు వృథా కాకూడదంటే.. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ముందు అవసరాలను వర్గీకరించుకోవాలి. ఆ ప్రకారం షాపింగ్ చేస్తే సమయం, డబ్బు ఆదా అవుతుంది.

* డెట్ స్కీమ్స్‌ వద్దు

అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో పాటు కొన్ని రిటైల్ స్టోర్స్ కూడా డెట్ స్కీమ్స్‌తో షాపింగ్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. బై నౌ- పే లేటర్(BNPL) ప్లాన్స్, నో కాస్ట్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్‌ వంటివి ఈ స్కీమ్‌లోకి వస్తాయి. అయితే ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని.. ఈఎంఐ సక్రమంగా కట్టడంలో ఒకసారి డిఫాల్ట్ అయితే, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

ఇది కూాడా చదవండి : ధర రూ.10,000 లోపే.. బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

దీంతోపాటు ఎక్కువ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. నో-కాస్ట్ EMIలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఫైనాన్స్ కంపెనీ బకాయి ఉన్న వాయిదాలపై దాదాపు 4 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజులు, వార్షిక రుసుములు, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH)/చెక్ బౌన్స్ ఛార్జీలను కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మీ బడ్జెట్‌ను మించి షాపింగ్ చేయకపోవడం మంచిది.

* ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ధరలను పోల్చండి

ఇటీవల కాలంలో ఆఫ్‌లైన్ రిటైలర్స్ సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పెద్ద మాల్స్‌తో పాటు చిన్న అవుట్‌లెట్స్ కూడా ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఆఫ్‌లైన్ రిటైలర్స్ వద్ద ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా ఆన్‌లైన్‌లో దాని రేట్, డిస్కౌంట్ ఆఫర్లను చెక్ చేయండి. దీంతో ఎక్కడ తక్కువకు లభిస్తుందో అక్కడ కొనుగోలు చేయండి. దీంతో డబ్బు ఆదా అవుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Festival, Online shopping, Personal Finance

ఉత్తమ కథలు