హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Loans: ఫెస్టివల్ సీజన్‌లో హోమ్‌ లోన్లకు బ్యాంకుల ప్రాధాన్యం.. టూవీలర్‌, ట్రావెల్‌ లోన్లకూ పెరిగిన డిమాండ్‌

Bank Loans: ఫెస్టివల్ సీజన్‌లో హోమ్‌ లోన్లకు బ్యాంకుల ప్రాధాన్యం.. టూవీలర్‌, ట్రావెల్‌ లోన్లకూ పెరిగిన డిమాండ్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఫెస్టివల్ సీజన్‌లో లోన్లు తీసుకున్న వారి సంఖ్య ఒకప్పటితో పోలిస్తే పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్లను పెంచినప్పటికీ కొన్ని బ్యాంకులు గృహ రుణ రేట్లను తగ్గించాయి. రుణాలకు డిమాండ్‌ పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Bank Loans: సాధారణంగా పండుగల సమయంలో కొనుగోళ్లు పెరుగుతాయి. ప్రజలను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులు ప్రయత్నిస్తారు. అయితే భారీ మొత్తంలో చేసే కొనుగోళ్ల కోసం చాలామంది బ్యాంక్ లోన్ల(Bank Loans)పై ఆధారపడతారు. అందుకే బ్యాంకులు ఇలాంటి సమయాల్లో తక్కువ వడ్డీలకు రుణాలు అందించాలని చూస్తాయి. ఈ క్రమంలో ఫెస్టివల్ సీజన్‌లో లోన్లు తీసుకున్న వారి సంఖ్య ఒకప్పటితో పోలిస్తే పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్లను పెంచినప్పటికీ కొన్ని బ్యాంకులు గృహ రుణ రేట్లను తగ్గించాయి. రుణాలకు డిమాండ్‌ పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

టైర్‌ 1, టైర్‌ 2 పట్టణాల నుంచి డిమాండ్‌

భారతదేశంలోని బ్యాంకులు, NBFCలు 2022 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 25 వరకు ఎక్కువగా రుణాలు మంజూరు చేశాయి. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ లెంట్రా వివరాల మేరకు.. ఈ పండుగ సీజన్‌లో ప్రాసెస్ చేసిన అప్లికేషన్‌లలో 47 శాతం వృద్ధి కనిపించింది. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈ పండుగ సీజన్‌లో హోమ్ లోన్ వినియోగదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు ప్రాధాన్యతనిచ్చాయి. సెప్టెంబరులో RBI పాలసీ రేటును 50 bps నుంచి 5.90 శాతానికి పెంచింది. అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ పండుగ సీజన్‌లో గృహ రుణ రేట్లను తగ్గించాయి. టైర్ 2, టైర్ 3 పట్టణాల నుంచి గృహ రుణాలకు ఎక్కువ డిమాండ్‌ కనిపించిందని లెంట్రా తమ నివేదికలో పేర్కొంది. అందుకే ఈ సీజన్‌లో ప్రాసెస్‌ చేసిన అప్లికేషన్‌ల సంఖ్యలో పెరుగుదల కనిపించిందని తెలిపింది.

ధన్‌తేరాస్‌కు 5 లక్షల అప్లికేషన్లు

నివేదిక ప్రకారం.. భారతదేశంలోని దాదాపు 50 ఫైనాన్షియల్ సంస్థలు, లెంట్రా సేవలందిస్తున్న HDB ఫైనాన్షియల్ సహా సర్వీసెస్, కన్సూమర్‌, టూ వీలర్‌, ట్రావెల్‌, గృహ రుణాల్లో పెరుగుదల కనిపించింది. KYC, కాంప్లియన్స్‌, ఆన్‌బోర్డింగ్, సర్వీసింగ్, ఇతర కలెక్షన్లతో ఆర్థిక సంస్థ రుణ అవసరాల మొత్తం స్పెక్ట్రమ్‌ను లెంట్రా కవర్ చేస్తుంది. లెంట్రా ప్లాట్‌ఫారమ్‌లో లోన్ ఒరిజినేషన్ వాల్యూమ్‌లు 2021లో అదే రోజుతో పోలిస్తే ఒక్క ధన్‌తేరాస్‌లో 5 లక్షలకు పైగా అప్లికేషన్‌లకు పెరిగాయని నివేదిక తెలిపింది.

మారుతున్న పరిస్థితులు

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లెఫ్టినెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కార్తీక్ శ్రీనివాసన్ ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. పండుగల సీజన్ దసరాతో ప్రారంభమైందని, ధన్‌తేరస్, దీపావళి నాటికి ఊపందుకుందని తెలిపారు. కన్స్యూమర్ బిజినెస్‌, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్‌లు, టూ వీలర్స్, ఆటో లోన్‌లు వంటివి 2019 పండుగ సీజన్ వాల్యూమ్‌లను మించిపోయాయని చెప్పారు. ఇది 2-3 రోజులలో అనూహ్యంగా పెరగడం కంటే, 7 - 8 రోజులలో బాగా డిమాండ్‌ కనిపించిందని వివరించారు. ఈ పరిస్థితులు కరోనా తర్వాత వస్తున్న మార్పులకు ఉదాహరణగా నిలుస్తాయని వివరించారు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. పండుగ సీజన్‌లో బ్యాంకులు అందించిన ఆఫర్లతో డిమాండ్‌ను పెంచాయి. ఆంక్షలు లేకపోవడం, నిబంధనల సడలింపులతో వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని లెంట్రా ముఖ్య రెవెన్యూ అధికారి సందీప్ మాథుర్ ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.

First published:

Tags: Bank loans

ఉత్తమ కథలు